Betamcherla Tension : టీడీపీ ఆఫీస్‌పై దాడికి యత్నం.. బేతంచర్లలో టెన్షన్
నంద్యాల జిల్లా బేతంచర్లలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఆఫీస్ పై వైసీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దాడిని అడ్డుకున్నారు. మరోవైపు టీడీపీ నేతలను ఆఫీస్ నుంచి బయటకు పంపేశారు.

Betamcherla Tension : నంద్యాల జిల్లా బేతంచర్లలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఆఫీస్ పై వైసీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దాడిని అడ్డుకున్నారు. మరోవైపు టీడీపీ నేతలను ఆఫీస్ నుంచి బయటకు పంపేశారు.
Also Read..Gannavaram High Tension : గన్నవరంలో హైటెన్షన్.. టీడీపీ ఆఫీస్‌పై దాడి, కారుకి నిప్పు
టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించడం కలకలం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దాడిని అడ్డుకున్నారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. నిన్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీగా టీడీపీకి చెందిన వ్యక్తి నామినేషన్ వేయడానికి వెళ్లాడు. టీడీపీకి చెందిన కౌన్సిలర్లను, ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారని ఆ పార్టీ వర్గాలు ఆరోపించాయి.
అందులో భాగంగానే నామినేషన్ వేయడానికి వెళ్లిన వ్యక్తిపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో టీడీపీ ఆఫీస్ పై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించడం కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు.. వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారు.
దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎమ్మెల్సీగా నామినేషన్ వేసేందుకు వెళ్లిన తమ వాళ్లను కిడ్నాప్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఎన్నికల్లో వైసీపీకి తగిన రీతిలో బుద్ధి చెబుతారని టీడీపీ నేతలు హెచ్చరించారు.