Andhra Pradesh Politics : పవన్ కళ్యాణ్ – చంద్రబాబు భేటీపై బీజేపీ అధిష్టానం ఫోకస్ .. ఏపీ పాలిటిక్స్‌లో ఏం జరుగనుంది..?!

విశాఖపట్నంలో వైసీపీ, జనసేన మధ్య జరిగిన కీలక పరిణామాల తరువాత వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో పరుష పదజాలంతో విరుచుకుపడిన తరువాత ఏపీలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. వైసీపీ నేతలను పవన్ దుయ్యబడుతు ఇకనుంచి ఏపీలో రాజకీయాలు మారుతాయని అన్నారు. ఆయన అని కొన్ని గంటలు కూడా కాలేదు...టీడీపీ అధినేత..మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ తో భేటీ అయ్యారు. దీంతో ఏపీలో రాజకీయాలు ఒక్కాసారిగా వేడెక్కాయి. పవన్- చంద్రబాబు భేటీపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది.

Andhra Pradesh Politics : పవన్ కళ్యాణ్ – చంద్రబాబు భేటీపై బీజేపీ అధిష్టానం ఫోకస్ .. ఏపీ పాలిటిక్స్‌లో ఏం జరుగనుంది..?!

Pawan Kalyan-Chandrababu meeting

Updated On : October 19, 2022 / 11:51 AM IST

Pawan Kalyan-Chandrababu meeting : విశాఖపట్నంలో వైసీపీ, జనసేన మధ్య జరిగిన కీలక పరిణామాల తరువాత వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో పరుష పదజాలంతో విరుచుకుపడిన తరువాత ఏపీలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. వైసీపీ నేతలను పవన్ దుయ్యబడుతు ఇకనుంచి ఏపీలో రాజకీయాలు మారుతాయని అన్నారు. ఆయన అని కొన్ని గంటలు కూడా కాలేదు…టీడీపీ అధినేత..మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ తో భేటీ అయ్యారు. దీంతో ఏపీలో రాజకీయాలు ఒక్కాసారిగా వేడెక్కాయి. ఎవరికి తోచినట్లుగా వారు ఊహించేసుకుంటున్నారు.

రోడ్ మ్యాప్ ఇవ్వమంటేబీజేపీ కాలయాపన చేస్తోందని..ఈలోపు టైమ్ వేస్టు అవుతోందని బీజేపీ అన్నా..బీజేపీ పెద్దలన్నా తనకు చాలా గౌరవం ఉందని కానీ తన స్థాయి తగ్గించుకోలేనని ఊడిగం చేయనంటూ పవన్ స్పష్టం చేయటంతో బీజేపీకి పవన్ దూరం అవుతున్నారే వార్తలు వచ్చాయి. అదేసయమంలో ఎవ్వరు ఊహించనివిధంగా చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ ఆఫీసుకు రావటం ఇద్దరు చాలాసేపు మాట్లాడుకోవటం అనంతరం ప్రెస్ మీట్ పెట్టి ఏపీలో వైసీపీ నుంచి రాష్ట్ర ప్రజలను విముక్తం చేయటానికి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

దీంతో ఇక 2014 ఎన్నికల్లో లాగా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని వార్తలు గుప్పు మంటున్నాయి. కానీ ఈ ఇరుపార్టీల అధినేతలు మాత్రం ఎన్నికల్లో కలిసి పనిచేస్తామా? లేదా అనే విషయం ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరం..వైసీపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేయటం ముఖ్యం అంటూ తేల్చి చెప్పారు. కానీ ఇద్దరు కలిసి పనిచేయటం ఒక్కటే కాదు కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాయని వార్తలు కొనసాగుతున్నాయి. దీనిపై వైసీపీ కూడా అదే అంటోంది.

ఈక్రమంలో రోడ్ మ్యాప్ ఇవ్వమంటేబీజేపీ కాలయాపన చేస్తోందని..ఈలోపు టైమ్ వేస్టు అవుతోందని పవన్ చేసిన ఈ సున్నితమైన వ్యాఖ్యలు మరోలా ప్రొజెక్ట్ అయ్యాయి. పవన్ బీజేపీకి దూరం అవుతున్నారు అంటూ హల్ చల్ చేస్తున్నాయి. ఇటువంటి అంత్యంత కీలక పనిణామాలన్నింటిని ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు కేంద్రంలోని బీజేపీ అధిష్టానికి వివరించారు. ఏపీలోని ఇటువంటి కీలక పరిణామాలపై సోము వీర్రాజు ఇచ్చిన సమచారంతో బీజేపీ అధిష్టానం ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టిందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పవన్ తో చంద్రబాబు నాయుడు భేటీపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. పవన్ విశాఖ పర్యటనలో జరిగిన సంఘటనలు..చంద్రబాబు పవన్ తో అయిన భేటీ గురించి సోము వీర్రాజు బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బీజేపీ పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఎటువంటి కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది.

కాగా..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైన క్రమంలో దీనిపై బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు , పవన్ భేటీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. నిన్న సోము వీర్రాజును కూడా పవన్ కలిశారని విష్ణువర్థన్ రెడ్డి గుర్తుచేస్తున్నారు.

పవన్ – బీజేపీ విడిపోవాలని అనుకునేవారే చంద్రబాబు..పవన్ భేటీని హైప్ చేస్తున్నారని అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది పవన్, బీజేపీల లక్ష్యమని..జనసేన పట్ల విశాఖలో జరిగిన పలు పరిణామాలపై బీజేపీ స్పందించిందని విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు. పవన్ వెంటే ఏపీ నాయకత్వం , బీజేపీ కేంద్ర పెద్దలు వున్నారని ఆయన స్పష్టం చేశారు.