AP Cinema Tickets : సినిమా టికెట్ ధరలపై జనవరిలో మరోసారి భేటీ కానున్నకమిటీ
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిభేటీ ముగిసింది.

Tickets Rate Committee
AP Cinema Tickets : ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిభేటీ ముగిసింది. హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అధ్యక్షతన సమావేశమైన 12 మంది సభ్యులు… ఫిలిం ఛాంబర్ సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఢిల్లీ పర్యటనలో ఉండటంతో ఈసమావేశానికి హాజరు కాలేదు. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశం తిరిగి జనవరిలో ఫిజికల్ గా సమావేశం అవ్వాలని నిర్ణయించుకుంది.
ఈలోపు ఫిలిం ఛాంబర్ సభ్యులు తమ ప్రతిపాదనలను లిఖిత పూర్వకంగా సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ కమిటీ ఛైర్మన్ సూచించారు. తొందరపాటుగా కాకుండా టికెట్ల అంశం పై సమగ్రంగా నివేదిక తయారు చేయాలని కమిటీ ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు సూచించింది. కాగా….టికెట్ల తగ్గింపును ప్రజలు స్వాగతిస్తున్నారు అని సినీ గోయర్స్ అసోసియేషన్ ప్రతినిధి సభ్యులు ప్రభుత్వ కమిటీ నివేదించారు.
Also Read : Uttar Pradesh Politics : పేర్లు గందరగోళం…మరో పెర్‌ఫ్యూమ్ వ్యాపారి ఇంట్లో ఐటీ సోదాలు
మరోవైపు తమకు ఉన్న ఇబ్బందులను ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ సభ్యులు ప్రభుత్వ కమిటీకి తెలిపారు. సినీ పరిశ్రమ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాజిటివ్ గా ఉందని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాసు అన్నారు.