బాలికను ఇంట్లో బంధించి, నాలుగు రోజులుగా ఏడుగురు యువకుల అత్యాచారం

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో దారుణం జరిగింది. బాలికపై ఏడుగురు యువకులు నాలుగు రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డారు. మధురపూడికి చెందిన 16 సంవత్సరాల బాలికను ఏడుగురు యువకులు క్వారీ సెంటర్ లో ఓ ఇంట్లోకి తీసుకెళ్లి నాలుగు రోజులుగా అత్యాచారం చేశారు. బాలికను చిత్ర హింసలు పెట్టారు. తర్వాత బాధితురాలిని పోలీస్ స్టేషన్ బయట వదిలి పెట్టి వెళ్లి పోయారు.
ఓ మహిళా కానిస్టేబుల్ కు తనపై జరిగిన అత్యాచారం గురించి బాధితురాలు చెప్పింది. అయితే అబద్ధం చెబుతున్నావంటూ ఆ మహిళా కానిస్టేబుల్ పట్టించుకోలేదు. దీంతో రాజమండ్రి బీజేపీ మహిళా నేతలను బాధితురాలు ఆశ్రయించింది. వారి చొరవతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
మధురపూడికి చెందిన బాలికకు మాయ మాటలు చెప్పిన ఏడుగురు యువకులు..ఆమెను క్వారీ సెంటర్ లోని ఇంట్లోకి తీసుకెళ్లారు. నాలుగు రోజులపాటు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆ బాలిక చెప్పింది. అంతేకాకుండా తనను చిత్ర హింసలకు గురి చేశారని ఆరోపించారు. బాలికను తీసుకెళ్లిన ఇంట్లోకి తీసుకెళ్లగా ఆ ఇంటిలోని మహిళ కూడా యువకులకు వత్తాసు పలికిందని, తనను చిత్రహింసలకు గురి చేసిందని చెప్పారు.
నాలుగు రోజుల అనంతరం ఇవాళ ఉదయం నిందితులు బాధితురాలిని పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలేసి వెళ్లారు. ఈ నేపథ్యంలో బాధితురాలు సమీపంలోని పోలీస్ ష్టేషన్ కు వెళ్లి అక్కడున్న మహిళా కానిస్టేబుల్ తో తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పింది. బాలిక నాలుగు రోజులుగా చిత్రహింసలకు గురవ్వడం, షాక్ లో ఉండటంతో బాలిక చెప్పిన మాటలు పొంతనలేకపోవడంతో మహిళా కానిస్టేబుల్ పట్టించుకోలేదు. బాధితురాలు బీజేపీ మహిళా నేతలను ఆశ్రయించింది. వారి చొరవతో పోలీసులు చివరికి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.