Andhra Pradesh Crime : కర్నూలులో తోడికోడళ్ల హత్య కేసులో వీడిన మిస్టరీ ..

 కర్నూలులో తొడికోడళ్ల హత్య కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు. వారి భర్తలు..తండ్రితో కలిసి వారిద్దరిని హత్య చేసినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు మృతుల భర్తలైన పెద్ద గోవిందు,చిన్నగోవిందు, వారి తండ్రి గోగన్నలను అరెస్ట్ చేశారు

Andhra Pradesh Crime : కర్నూలులో తోడికోడళ్ల హత్య కేసులో వీడిన మిస్టరీ ..

mystery behind the murder of two women in Kurnool

Updated On : December 16, 2022 / 12:03 PM IST

Andhra Pradesh Crime : కర్నూలులో తొడికోడళ్ల హత్య కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు. వారి భర్తలు..తండ్రితో కలిసి వారిద్దరిని హత్య చేసినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు మృతుల భర్తలైన పెద్ద గోవిందు,చిన్నగోవిందు, వారి తండ్రి గోగన్నలను అరెస్ట్ చేశారు. గోగన్న కుటుంబానికి రూ.20 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. కానీ ఇంటి కోడళ్లకు పిల్లలు పుట్టలేదు. దీంతో వారసులు లేరని వారి భర్తలు ఇద్దరు తమ తండ్రితో కలిసి తోడికోడళ్లను హత్య చేసినట్లుగా తేలింది.

కాగా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం నన్నూరులో తోడికోడళ్లు రేణుక,రామేశ్వరిల జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. దీంతో పోలీసులు వారి భర్తలను..మామ గోగన్నను అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. కోట్ల రూపాయాల విలువ చేసే ఆస్తులున్నా..తోడికోడళ్లల్లో ఎవరికి పిల్లలు పుట్టకపోవటంతో వారిని వదిలించుకుని మరో వివాహం చేసుకోవటానికి వారి భర్తలిద్దరు తండ్రితో కలిసి హత్యలకు పాల్పడినట్లుగా నిందితులే వెల్లడించారు.

గోగన్నకు చిన్నగోవిందు, పెద్ద గోవిందు కుమారులు. వారిది వ్యవసాయ కుటుంబం. గోవిందులిద్దరి భార్యలు ఇంటిపనితో పాటు వ్యవసాయం పనులు..పశువుల పనులు చూసుకుంటుంటారు. ఈక్రమంలో తోడికోడళ్లు ఇద్దరు పశువుల గడ్డి కోసం పొలం వెళ్లగా అక్కడ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వారిని హత్య చేశారు. ఈ జంట హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్థానికంగా విచారించారు. తోడికోడళ్లకు పిల్లలు లేరని తెలిసింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. గోగన్నతో పాటు గోవిందులిద్దరు అన్నదమ్ములను అదుపులోకి తీసుకుని విచారించగా తోడికోడళ్లిద్దరికి పిల్లలు పుట్టటంలేదని తామే వారిని హత్య చేయించామని అంగీకరించారు. దీంతో తోడికోడళ్ల జంట హత్యల మిస్టరీని ఛేదించారు పోలీసులు.