Thieves : చిత్తూరు జిల్లాలో ఆవుల దొంగలు

చిత్తూరు జిల్లాలో ఆవుల అపహరణ కలకలం సృష్టిస్తుంది. గత కొద్దీ రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఆవుల్ని అపహరిస్తున్నారు. తాజాగా తిరుచానూరులోని గోశాలకు చెందిన మూడు ఆవులను దొంగలు అపహరించారు.

Thieves : చిత్తూరు జిల్లాలో ఆవుల దొంగలు

Thieves

Updated On : June 15, 2021 / 3:34 PM IST

Thieves : చిత్తూరు జిల్లాలో ఆవుల అపహరణ కలకలం సృష్టిస్తుంది. గత కొద్దీ రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఆవుల్ని అపహరిస్తున్నారు. తాజాగా తిరుచానూరులోని గోశాలకు చెందిన మూడు ఆవులను దొంగలు అపహరించారు. రాత్రి సమయంలో గోశాలలోకి ప్రవేశించి మూడు గోవులను తీసుకెళ్లారు.

దీనికి సంబందించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి. మూడు గోవులు కనిపించకపోవడంతో గోశాల సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా గత కొద్దీ రోజులుగా ఆవుల దొంగతనం అధికంగా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆవుల అపహరణపై ఫిర్యాదు రావడంతో పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఆవుల అపహరణపై జిల్లా వ్యాప్తంగా ఐదారు ఫిర్యాదు అందినట్లుగా తెలుస్తుంది.

ఎవరు దొంగిలిస్తున్నారు… ఆవులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది దొంగలను పెట్టుకుంటేనే తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆవులు అపహరించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.