Vizag Steel Plant : కేసీఆర్ రాకకోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు : తోట చంద్రశేఖర్

 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ రాకకోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు అంటూ తోట చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Vizag Steel Plant : కేసీఆర్ రాకకోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు : తోట చంద్రశేఖర్

Thota Chandrasekhar Vizag Steel Plant Bidding

Updated On : April 12, 2023 / 1:36 PM IST

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్డింగ్‌లో పాల్గొనాలను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాజకీయం వేడెక్కింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంట్రీ ఇస్తోంది అంటూ ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అలాగే ఏపీలో ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి.

దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏమాత్రం వ్యతిరేకత లేదని..ఇది కేవలం రాజకీయ ప్రాపగాండ మాత్రమేనని కేసీఆర్ రాకకోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ను దక్కించుకోవాటానికి కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తు నిసనలు చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారని మీరు వచ్చి స్టీల్ ప్లాంట్ ను సేవ్ చేయండి అని కోరతు ఆహ్వానం పంచాయని తెలిపారు. మేము రోడ్డున పడకుండా ఉండాలంటే స్టీల్ ప్లాంట్ సమస్యను మీరే పరిష్కరించగలరు అని కోరాయాని తెలిపారు తోట చంద్రశేఖర్. మేము రోడ్డున పడకుండా మీరే కాపాడగలరని కోరాయన్నారు.

Visakha Steel Plant: విశాఖ ఉక్కుపై తెలంగాణ సర్కార్ దృష్టి.. బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం.. ఈ నెలాఖరులో బహిరంగ సభ!

ఏపీలో ఉండే పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ సమస్యను అడ్డుకోలేవని అందుకే కార్మికులు, ఉద్యోగులు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు తోట. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మేము ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నాం అన్నారు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు తోట. కేంద్రం బిడ్స్ ఆహ్వానించిన నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించే విషయంలో ఏపీ ప్రభుత్వ చర్యలు కంటితుడుపుగా ఉన్నాయని తోట చంద్రశేఖర్ విమర్శించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్ కు ఎలాంటి రాజకీయ ప్రయోజనాలూ లేవని ఆయన స్పష్టం చేశారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరమైతే 35వేల మంది కార్మికులు రోడ్డునపడతారని ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అదానీకి ఇవ్వడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకే స్టీల్ ప్లాంట్ కు మైన్స్ కేటాయించలేదన్నారు. స్టీల్ ప్లాంట్ ను టేకోవర్ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తోట చంద్రశేఖర్ తెలిపారు. కచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఏపీ బీఆర్ఎస్ నేత తోట.

Visakha Steel Plant : బయ్యారం, విశాఖ ఉక్కులను అదానీకి కట్టబెట్టటానికి మోదీ కుట్రలు..తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలి : కేటీఆర్