Tiger : నంద్యాల జిల్లాలో మహిళపై పెద్దపులి దాడికి యత్నం

పెద్దఅనంతాపురం గ్రామాన్ని పెద్దపులి వీడడం లేదు. వరుస దాడులతో గ్రామస్థులు హడలి పోతున్నారు. గత రెండు రోజులుగా గ్రామంలో పశువులను పెద్దపులి వేటాడుతోంది.

Tiger : నంద్యాల జిల్లాలో మహిళపై పెద్దపులి దాడికి యత్నం

Tiger (1)

Updated On : June 22, 2023 / 9:18 AM IST

Tiger Attempt To Attack Woman : నంద్యాల జిల్లాలో మహిళపై పెద్దపులి దాడికి యత్నించింది. ఆత్మకూరు మండలం పెద్దఅనంతాపురం గ్రామంలో ఇంటి ఆవరణంలో ఉన్న లక్ష్మమ్మ అనే మహిళపై పెద్దపులి దాడి చేయడానికి ప్రయత్నించింది. స్థానికుల అరుపులు, కేకలతో పెద్దపులి పరుగులు తీసింది. కాగా, పెద్దపులి ధాటికి స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

పెద్దఅనంతాపురం గ్రామాన్ని పెద్దపులి వీడడం లేదు. వరుస దాడులతో గ్రామస్థులు హడలి పోతున్నారు. గత రెండు రోజులుగా గ్రామంలో పశువులను పెద్దపులి వేటాడుతోంది. మొన్న (మంగళవారం), నిన్న(బుధవారం) అవులపై పెద్దపులి దాడి చేసింది. నేడు(గురువారం) అదే పెద్దపులి మహిళపై దాడి చేసింది.

Prakasam Bus Fire : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతతో 25 మంది ప్రయాణికుల ప్రాణాలు సేఫ్

తరచూ పెద్దపులి సంచరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.