Tirumala Darshan Tokens : శ్రీవారి మెట్టు దగ్గర తిరుమల దర్శనం టోకెన్ల దందా..! భక్తులకు అందాల్సిన టికెట్లు దారి మళ్లింపు..!

ఆ మార్గంలో ప్రతి రోజు 3వేల టోకెన్లను భక్తులకు టీటీడీ జారీ చేస్తుంది.

Tirumala Darshan Tokens : శ్రీవారి మెట్టు దగ్గర తిరుమల దర్శనం టోకెన్ల దందా..! భక్తులకు అందాల్సిన టికెట్లు దారి మళ్లింపు..!

Updated On : December 29, 2024 / 5:31 PM IST

Tirumala Darshan Tokens : తిరుమలలో దర్శనం టోకెన్ల దందాకు తెరలేపారు. శ్రీవారి మెట్టు మార్గం దగ్గర తిరుమల దర్శనం టోకెన్ల దందా సాగుతోంది. ఆటో డ్రైవర్లు, టీటీడీ సిబ్బంది కలిసి చేతివాటం ప్రదర్శిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. దీంతో టైమ్ స్లాట్ దర్శనం కోసం వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. భక్తులకు అందాల్సిన టికెట్లు దారి మళ్లిస్తున్నా.. టీటీడీ విజిలెన్స్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి రోజూ భక్తులకు 3వేల టోకెన్లు జారీ..
తిరుమల నడక దారి.. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు నిత్యం భక్తులు వెళ్తుంటారు. ఆ మార్గంలో ప్రతి రోజు 3వేల టోకెన్లను భక్తులకు టీటీడీ జారీ చేస్తుంది. ఇచ్చే టోకెన్లలో దళారీలు జోక్యం చేసుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆటోవాలాలు, ట్యాక్సీ డ్రైవర్లు నేరుగా పార్టీలను అక్కడికి తీసుకొచ్చి అక్కడ కౌంటర్ సిబ్బందితో మాట్లాడుకుని అడ్డదారిలో వారికి టోకెన్లు కేటాయిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు వద్దంటూ ఏపీ ప్రభుత్వం వినూత్న ప్రచారం

అడ్డదారిలో వచ్చిన వారికి టోకెన్లు ఇస్తున్నారని భక్తుల ఆగ్రహం..
కొందరు భక్తులు అక్కడికి చేరుకున్నప్పటికీ.. క్యూలో ఉన్న వారికి టోకెన్లు ఇవ్వకుండా అడ్డదారిలో వచ్చిన వారికి టోకెన్లు ఇస్తుండటం వారికి ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో అక్కడున్న విజిలెన్స్ అధికారులకు వాళ్లు ఫిర్యాదు చేశారు. వాళ్లు కూడా వారితో కుమ్మక్కై చర్యలు తీసుకోలేదని భక్తులు
ఆరోపిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి మెట్టు నడక మార్గంలో భక్తులకు టోకెన్లు జారీ చేస్తారని ఎంతో ఆశ పెట్టుకుని భక్తులు తిరుమలకు వస్తుంటారు.

Tirumala

Tirumala (Photo Credit : Google)

శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్లు తీసుకున్నట్లైతే ఈజీగా దర్శనం అవుతుందని భక్తులు భావిస్తారు. అందుకే అక్కడికి చేరుకునే భక్తులకు ఈ రకంగా ముందుగానే దళారీలతో అక్కడి వారి కుమ్మక్కై అడ్డదారిలో టోకెన్లు కట్టపెట్టడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

 

Also Read : గతం మర్చిపోయావా..? మాజీ మంత్రి పేర్ని నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు