YV Subba Reddy : వేగంగా తిరుమల రెండో ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు.. వైకుంఠ ఏకాదశిలోపు అందుబాటులోకి..!

తిరుమలలో రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో మరమ్మతు పనులను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. ఐఐటీ నిపుణుల సూచనల మేరకు ఘాట్ రోడ్ లో మరమ్మతు పనులు..

YV Subba Reddy : వేగంగా తిరుమల రెండో ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు.. వైకుంఠ ఏకాదశిలోపు అందుబాటులోకి..!

Yv Subba Reddy

Updated On : December 16, 2021 / 8:21 PM IST

YV Subba Reddy : తిరుమలలో రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో మరమ్మతు పనులను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. ఐఐటీ నిపుణుల సూచనల మేరకు ఘాట్ రోడ్ లో మరమ్మతు పనులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఘాట్ రోడ్డు పూర్తి స్థాయిలో పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని చెప్పారు.

WhatsApp Group Admins : వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు న్యూ పవర్..? అందరి మెసేజ్‌లు డిలీట్ చేయొచ్చు!

ఈ నెలాఖరుకు ఘాట్ రోడ్డు పనులు పూర్తి చేయడానికి రాత్రింబవళ్లు పని చేస్తున్నట్టు వివరించారు. నూతన సంవత్సరంలో రెండవ ఘాట్ రోడ్డు పూర్తిస్థాయిలో భక్తులకు అందుబాటులోకి వస్తుందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. జనవరి ఒకటో తేదీ తర్వాత ఘాట్ రోడ్డు ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. 7, 8, 9 కిలోమీటర్ల దగ్గర పూర్తిస్థాయిలో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని చెప్పారు.

బండ రాళ్లు పడి రోడ్డు ధ్వంసం అయిన 14, 15 కిలోమీటర్లు దగ్గర మరమ్మతులు జరుగుతున్నాయి. విరిగిపడడానికి సిద్ధంగా ఉన్న కొండ చరియలను గుర్తించామని, అవి పడకుండా ఐఐటీ నిపుణుల సూచన మేరకు పటిష్ట చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మరమ్మతులు పటిష్టంగా నిర్వహిస్తామన్నారు.

Omicron Variant vs Delta: డెల్టా కంటే ఒమిక్రాన్ ప్రమాదమా? రెండు వేరియంట్లలో ఏయే లక్షణాలు ఉన్నాయంటే..?

”వైకుంఠ ఏకాద‌శిలోపు పూర్తిస్థాయిలో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అనుమ‌తించేలా చూస్తాం. వ‌ర్షానికి పెద్ద బండ‌రాళ్లు ప‌డినా స్వామివారి దయవ‌ల్ల ఎవరికీ ప్రమాదం జరగలేదు. బండ‌రాళ్లను పూర్తి స్థాయిలో తొల‌గించాము. యుద్ధ ప్రాతిప‌దిక‌న పున‌రుద్ధర‌ణ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఐఐటీ నిపుణుల సూచ‌న‌ల మేర‌కు ఇంకా బండ‌రాళ్లు ప‌డే ప్రాంతాల‌ను గుర్తించి జాగ్రత్త చ‌ర్యలు తీసుకుంటున్నాము. ఈ ప‌నుల‌న్నింటినీ ఈ నెలాఖ‌రుకు పూర్తి చేసి రెండో ఘాట్ రోడ్డును భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకొస్తాము” అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు పడటంతో రోడ్డు ధ్వంసమైంది.