తిరుమల లడ్డూ వివాదంపై ప్రెస్‌మీట్‌లో వైఎస్ జగన్ సంచలన కామెంట్స్

చంద్రబాబు చేసింది మోసమని జగన్ అన్నారు.

తిరుమల లడ్డూ వివాదంపై ప్రెస్‌మీట్‌లో వైఎస్ జగన్ సంచలన కామెంట్స్

YS Jagan

Updated On : September 20, 2024 / 6:07 PM IST

తిరుమలలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీది అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకునే వైఖరి చంద్రబాబు నాయుడిదని అన్నారు. చంద్రబాబు చేసేవి అన్నీ డైవర్షన్ పాలిటిక్సేనని తెలిపారు.

నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని అసత్యాలు చెప్పారని జగన్ అన్నారు. సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబుకి ఇది తగునా? అని అన్నారు. పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు నాయుడు ఇలా కట్టుకథలు చెబుతున్నారని తెలిపారు.

కూటమి సర్కారు 100 రోజుల పాలనపై వైఎస్ జగన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. 100 రోజుల్లో సూపర్‌ సిక్సూ లేదు.. సెవనూ లేదని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. మహిళలకు రూ.18 వేల చొప్పున ఇస్తామన్నారని, పిల్లలకు రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారని, కానీ ఇవ్వలేదని తెలిపారు. చంద్రబాబు చేసింది మోసమని అన్నారు.

కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగానూ విఫలమైందని చెప్పారు. చంద్రబాబు నాయుడి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వ్యవస్థలూ తిరోగమనం చెందుతున్నాయని తెలిపారు. మభ్యపెట్టే రాజకీయం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారని చెప్పారు. ఏపీలో జరుగుతున్న అరాచక పాలనపై తాము ఢిల్లీలో ధర్నా చేశామని అన్నారు. అదే సమయంలో డైవర్షన్ కోసం మదనపల్లెలో ఫైల్స్ కాలిపోయానని అన్నారని తెలిపారు.

జగన్‌ కామెంట్స్‌

  • ప్రతి ఇంటికి వెళ్లి మరి మోసం చేశారు
  • 100 రోజుల్లో చేసింది మోసం.. మోసం.. మోసం..
  • ఇప్పటి వరకు ఒక్క బిల్ పాస్ కాలేదు
  • రైతు పూర్తిగా రోడ్డున్న పడాడ్డు
  • డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది
  • రాష్ట్రంలో ధర్మానికి రక్షణ లేకుండా పోయింది
  • డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు
  • అతి దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు
  • దేవునికుడా వదల్లేదు
  • ఒక ముఖ్యమంత్రి గా మాట్లాడాల్సిన మాటల అవి?

Priyanka Gandhi: మల్లిఖార్జున్ ఖర్గేకు జేపీ నడ్డా లేఖ.. ప్రియాంక గాంధీ ఫైర్