ఇంద్రకీలాద్రిలో ఈ మూడు రోజులు ఘాట్‌రోడ్డు మూసివేత.. భక్తులకు కీలక సూచనలు
ఈ మూడు రోజులు ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం కల్పించామని ఈవో తెలిపారు.

విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో ఈ నెల 6 నుంచి 8 వరకు ఘాట్ రోడ్డును మూసివేస్తున్నారు. మరమ్మతు పనులు చేయనున్న నేపథ్యంలో ఘాట్ రోడ్డును ఆయా తేదీల్లో పూర్తిగా మూసేస్తున్నామని ఆలయ కార్య నిర్వహణ అధికారి కె. రామచంద్ర మోహన్ తెలిపారు.
Also Read: ఈ మూడు స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనేస్తారా?
కనకదుర్గ నగర్ మార్గం నుంచి భక్తులు దేవస్థానానికి చేరుకోవాల్సి ఉటుందని అధికారులు చెప్పారు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు పున్నమి ఘాట్లో తమ వాహనాలు పార్క్ చేసుకోవాలి. అక్కడినుంచి దేవస్థానం ఏర్పాటు చేస్తున్న ఉచిత బస్సు ద్వారా దేవస్థానానికి చేరుకోవచ్చు.
విశాఖపట్నం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సీతమ్మ వారి పాదాల ప్రాంతంలో హోల్డింగ్ ఏరియాలో వాహనాలు పార్కు చేసుకుని దేవస్థానం ఏర్పాటు చేసే ఉచిత బస్సు ద్వారా దేవస్థానానికి చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మూడు రోజులు ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం కల్పించామని ఈవో తెలిపారు.