Video: ఒంటిమిట్ట సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు
శ్రీరామ నామస్మరణతో ఒంటిమిట్ట మార్మోగుతోంది.

కడప జిల్లాలోని ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొననున్నారు. ఈ మేరకు వారు ఒంటిమిట్టకు చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. శ్రీరామ నామస్మరణతో ఒంటిమిట్ట మార్మోగుతోంది. సీతారాములకు చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
కాగా, సీతారాముల కల్యాణ మహోత్సవ వేదిక కళాకృతులు జనకపురిని తలపించాయి. తెలుగుదనం ఉట్టిపడేలా రాములవారి కల్యాణ వేదికను సిద్ధం చేశారు. ప్రత్యేకంగా వరి గింజలతో మండపాన్ని తీర్చిదిద్దారు. పుష్పాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
టీటీడీ, కడప జిల్లా యంత్రాగం కొన్ని రోజుల ముందు నుంచే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. సీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నారు.
సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు దంపతులు ఒంటిమిట్ట చేరుకున్నారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామ నామస్మరణతో మార్మోగుతున్న ఒంటిమిట్ట. #Vontimitta #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/JsXUZITyJh
— Telugu Desam Party (@JaiTDP) April 11, 2025