Visakhapatnam : విశాఖలో విషాదం.. ఇద్దరు చిన్నారులుసహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Visakhapatnam : విశాఖపట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
Visakhapatnam
Visakhapatnam : విశాఖపట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో చోటు చేసుకుంది. స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కొత్తవలసకు చెందిన మల్ల వినోద్ కుమార్ కొంతకాలంగా జీవనోపాధి కోసం భార్య అహల్య, రెండేళ్లు, మూడేళ్లు వయసున్న ఇద్దరు పిల్లలతో కలిసి పెందుర్తిలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వినోద్ ఆటో డ్రైవర్గా కొనసాగుతుండగా.. అతని భార్య కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే, రాఖీ పండుగ రోజు సాయంత్రం ప్రవీణ్ కుమార్ ఉరివేసుకొని.. అతని భార్యతోపాటు ఇద్దరు చిన్నారులు విషపదార్థం తిని ఆత్మహత్య చేసుకున్నారు.
రాఖీ పండుగ సందర్భంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులతో రాఖీలు కట్టించుకున్నారు. అయితే, రాత్రి సమయంలో తన ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు RIP అంటూ మెస్సేజ్ పంపించినట్లు సమాచారం. వినోద్ కుమార్ ఇంటి వద్దకు వచ్చి చూడగా.. అప్పటికే వారి పడిపోయి ఉన్నారు. తల్లి, ఇద్దరు బిడ్డలను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. వారు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలా.. ఆర్థిక ఇబ్బందులు కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
