Nandyal District: నంద్యాల జిల్లాలో దారుణం.. విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది

నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నందికొట్కూరులోని బైరెడ్డి నగర్ కు చెందిన ఇంటర్ విద్యార్థినిపై ప్రేమించలేదనే కారణంతో ..

Nandyal District: నంద్యాల జిల్లాలో దారుణం.. విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది

Petrol Attack

Updated On : December 9, 2024 / 9:01 AM IST

Nandyal district Petrol Attack: నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నందికొట్కూరులోని బైరెడ్డి నగర్ కు చెందిన ఇంటర్ విద్యార్థినిపై ప్రేమించలేదనే కారణంతో ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తరువాత తాను కూడా నిప్పంటించుకున్నాడు. అయితే, ఈ ఘటనలో బాలిక తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించగా.. ప్రేమోన్మాదికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Also Read: Donald Trump: అమెరికాలో అక్రమ వలసదారులకు మరోసారి ట్రంప్ వార్నింగ్.. ‘జన్మహక్కు పౌరసత్వం’పై కీలక వ్యాఖ్యలు

స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. బైరెడ్డి నగర్ కు చెందిన ఓ విద్యార్థిని ఇంటర్ చదువుతుంది. కొద్దికాలంగా ఓ యువకుడు ప్రేమపేరుతో విద్యార్థిని వెంటపడుతున్నాడు. అతడి ప్రేమను యువతి అంగీకరించలేదు. దీంతో ఆ యువకుడు విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. ఆ తరువాత తానూ నిప్పంటించుకున్నాడు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన విషయాలపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ దారుణ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసిద ర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.