Kavitha – Pawan Kalyan: మా జోలికి వస్తే మూతి పళ్లు రాలతాయ్..!- పవన్ కల్యాణ్‌కు కవిత వార్నింగ్..
తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడతామంటే సైలెంట్ గా ఉండేదే లేదన్నారు. టీఆర్ఎస్ 2.O తో పెట్టుకుంటే సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Kavitha – Pawan Kalyan: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత హాట్ కామెంట్స్ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలగొట్టి పార్సెల్ చేస్తామన్నారు. సెటిలర్స్ తమ వాళ్లే అన్న కవిత ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనుకునే రాజకీయ నాయకులను వదిలేది లేదని హెచ్చరించారు. తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడతామంటే సైలెంట్ గా ఉండేదే లేదన్నారు. టీఆర్ఎస్ 2.O తో పెట్టుకుంటే సంగతి చూస్తామని కవిత వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలకొట్టి పార్సల్ పంపుతామన్నారు. తమ అస్తిత్వంపై దాడి చేస్తూ మీ సంస్కృతి రుద్దుతామంటే ఊరుకోము అని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ జెండా రాకముందు ఒకలా, ఇప్పుడు ఒకలా ఉంటుందన్నారు. టీఆర్ఎస్ 2.0 తో పెట్టుకుంటే మూతి పళ్లు రాలుతాయని హెచ్చరించారు. ఒకసారి పెట్టుకుంటే తెలంగాణ తెచ్చుకున్నామన్న కవిత.. మళ్లీ మా జోలికి వస్తే మూతి పళ్లు రాలుతాయని వార్నింగ్ ఇచ్చారు.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై ఫైర్ అయ్యారు కవిత. ఆంధ్రాలో రాజధాని కట్టటం చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంట్ సీఎంగా ఉండటంతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్.. ముందు మీ సెక్రటేరియేట్ లోకి నీళ్లు రాకుండా చూసుకోండి.. తర్వాత తెలంగాణలో నవ నిర్మాణ సభ పెట్టుకోండి అని సూచించారు. తెలంగాణలో ఎక్స్ టెన్షన్ అవ్వటానికి లోకేష్ బాబు ఇది మీ సామ్రాజ్యం కాదని వ్యాఖ్యానించారు. ఆంధ్రా పార్టీలకు ఇక్కడి ప్రజలు ఓట్లు వేయకపోవటంతోనే దుకాణం బంద్ పెట్టుకున్నది మర్చిపోయారా? అని నిలదీశారు కవిత.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ జనసేనాని పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సభ రాజకీయ దుమారం రేపుతోంది. పవన్ కల్యాణ్ పై తెలంగాణ నాయకులు ఫైర్ అవుతున్నారు. అధికార, విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. ఆంధ్రా నాయకులకు తెలంగాణతో ఏం పని అని ప్రశ్నిస్తున్నారు. మీ రాజకీయాలు ఆంధ్రాలోనే చేసుకోండి తెలంగాణ జోలికి రావొద్దని వార్నింగ్ లు ఇస్తున్నారు.
Also Read: 1.1 కోట్ల మందికి ప్రభుత్వం శుభవార్త.. వారి జీతాలు పెరగనున్నాయి.. నేటి నుంచే అమలు…
