వచ్చేనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: టీటీడీ ఛైర్మన్
మొత్తం 182 గంటల దర్శన సమయంలో సామాన్య భక్తులకు 164 గంటలు కేటాయిస్తామన్నారు.
TTD Chairman BR Naidu
TTD: టీటీడీ పాలక మండలి ఇవాళ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని నిర్ణయించింది.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మొత్తం 182 గంటల దర్శన సమయంలో సామాన్య భక్తులకు 164 గంటలు కేటాయిస్తామన్నారు. తొలి మూడు రోజులు రూ.300తో పాటు శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15,000 రూ.300 దర్శన టిక్కెట్లతో పాటు 1,000 శ్రీవాణి టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో ఇస్తామన్నారు. (TTD)
మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే..
- అమరావతిలో 27న శ్రీవారి ఆలయ ప్రకారానికి సీఎం చేతుల మీదుగా భూమి పూజ
- పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారించాలని ప్రభుత్వానికి లేఖ ద్వారా నివేదిక
- మొత్తం 8 లక్షల టికెట్లు కేటాయిస్తాము
- స్థానికులకు 5 వేల టికెట్లు బుక్ చేసుకునే అవకాశం
- రోజుకు 20 గంటల్లో 17.5 గంటలు సామాన్య భక్తులకు అవకాశం కల్పిస్తాము
- మొదటి మూడు రోజులు దర్శన టికెట్లు ఉన్న వారికే దర్శనం
- నాలుగో రోజు నుంచి సర్వదర్శనం అమలు
- వాట్సప్‌లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు
- గోవింద మాల భక్తులు ప్రత్యేక దర్శనాలు ఉండవు, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి
