Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆలయాల్లో యూపీఐ చెల్లింపులకు టీటీడీ ఏర్పాట్లు

టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఆయా ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆలయాల్లో యూపీఐ చెల్లింపులకు టీటీడీ ఏర్పాట్లు

Tirumala UPI payments

Updated On : July 1, 2023 / 11:44 PM IST

Tirumala Temples UPI Payments : తిరుమల శ్రీవారి భక్తులకు (తిరుమల తిరుపతి దేవస్థానం)టీటీడీ శుభవార్త తెలిపింది. స్థానిక ఆలయాలతోపాటు ఉప ఆలయాల్లోనూ యూపీఐ చెల్లింపులకు టీటీడీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. సేవ టిక్కెట్లు, ప్రసాదాలు, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, డైరీలు, క్యాలెండర్లు కొనుగోలు చేసే భక్తుల సౌకర్యార్థం ఫోన్ పే, క్యూ ఆర్ కోడ్ స్కానర్ ద్వారా యూపీఐ, డెబిట్ కార్డు(ఆన్ లైన్) ద్వారా చెల్లించేందరుకు చర్యలు చేపట్టాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు ఆయన శనివారం ఆయా ఆలయాల అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మం మాట్లాడుతూ టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఆయా ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

Tirumala : జులై మాసంలో తిరుమలలో విశేష ఉత్సవాలు

టీటీడీ వెబ్ సైట్, ఎస్వీబీసీ, యాత్రికులు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్, బస్టాండ్ ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల గురించి తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. స్థానిక ఆలయాల్లో కళ్యాణోత్సవంతోపాటు ఇతర ఆర్జితసేవలు ప్రారంభించేందుకు గల అవకాశాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు.

ఆలయాల్లో పచ్చదనం-పరిశుభ్రతలో భాగంగా భక్తులకు మరింత ఆధ్యాత్మిక, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కలు పెంచాలని డీఎఫ్ వోను ఆదేశించారు. అన్ని ఆలయాల్లో పారిశుధ్యానికి పెద్దపేట వేయాలని అధికారులను సూచించారు. ఆలయాల్లో యూపీఏ చెల్లింపుల ఏర్పాటుపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.