టీటీడీ కీలక నిర్ణయం.. నలుగురు అన్యమత ఉద్యోగులపై సస్పెండ్ వేటు..
టీటీడీలో ఉద్యోగులుగా ఉంటూ అన్యమతాన్ని ఆనుసరిస్తున్నారని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విభాగం అధికారులు విచారణ చేపట్టారు. వారి విచారణలో సదరు ఉద్యోగులు..

TTD
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. టీటీడీలో ఉద్యోగాలు చేస్తూ అన్యమతాలను ఆచరిస్తున్న వారిని విధుల నుంచి తప్పిస్తుంది. ఈ క్రమంలో టీటీడీ దేవస్థానం తాజాగా.. నలుగురు ఉద్యోగులపై సస్పెండ్ వేటు వేసింది.
టీటీడీలో ఉద్యోగులుగా ఉంటూ అన్యమతాన్ని ఆనుసరిస్తున్నారని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విభాగం అధికారులు విచారణ చేపట్టారు. వారి విచారణలో సదరు ఉద్యోగులు క్రిస్టియానిటీ అనుసరిస్తున్నారని ఆధారాలు లభిచడంతో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (క్వాలిటీ కంట్రోల్) బి.ఎలిజర్, బర్డ్ ఆసుపత్రి స్టాప్ నర్స్ ఎస్. రోసి, అదే ఆస్పత్రిలో గ్రేడ్ -1 ఫార్మసిస్ట్ ఎం.ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ ఉద్యోగి డా.జి.అసుంత లను టీటీడీ సస్పెండ్ చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులుగా పనిచేస్తూ.. సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించకపోవడంతోపాటు హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ భాద్యతా రహితంగా వ్యవహరిస్తున్నట్లు నలుగురు ఉద్యోగులపై ఆరోపణలు వచ్చాయి. విచారణ అనంతరం టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని టీటీడీ పేర్కొంది.