Tulasi Reddy: ప్రధానిగా రాహుల్ తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైలు పైనే: తులసి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ప్రత్యేక హోదాను సాధించడంలో ప్రాంతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయి

Tulasi Reddy: ప్రధానిగా రాహుల్ తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైలు పైనే: తులసి రెడ్డి

Tualis

Updated On : February 15, 2022 / 12:11 PM IST

Tulasi Reddy: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాట తప్పిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. మంగళవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా, భాజపా, తెదేపా పార్టీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రదేశ్ హక్కు అని.. రాష్ట్రానికి సంజీవిని వంటిదని తులసి రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ప్రత్యేక హోదాను సాధించడంలో ప్రాంతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని దుయ్యబట్టిన తులసి రెడ్డి.. ప్రాంతీయ పార్టీలవి ఉడత ఊపులు మాత్రమేనని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, జగన్ పార్టీ, జనసేన పార్టీలకు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదని ఆయన అన్నారు.

Also read: Road Accident: రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం ఖైదీ సహా ఐదుగురు మృతి

ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పేటెంట్ అని.. కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమౌతుందని తులసి రెడ్డి అన్నారు. 2024లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రధానిగా రాహుల్ తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైలు పైనే పెడతారని తులసి రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా సాధనలో ప్రాంతీయ పార్టీలది “పెండ్లింటి కాడ కుక్కల గోల లాంటిదని: అభివర్ణించిన తులసి రెడ్డి.. ప్రాంతీయ పార్టీల ఉచ్చులో, మాయలో, గోలలో పడకండంటూ ప్రజలకు సూచించారు. మాటమీద నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని ఆయన అన్నారు.

Also read: Jio Mobile: “గ్లాన్స్”లో రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్ “జియో”