కవలల ప్రాణం తీసిన తల్లి వివాహేతర సంబంధం

  • Published By: murthy ,Published On : September 15, 2020 / 01:11 PM IST
కవలల ప్రాణం తీసిన తల్లి వివాహేతర సంబంధం

Updated On : September 15, 2020 / 2:11 PM IST

చిత్తూరు జిల్లా సదుంలో దారుణం జరిగింది. తల్లి వివాహేతర సంబంధం కారణంగా అభం,శుభం తెలియని ఇద్దరు చిన్నారులు బలయ్యారు. జిల్లాలోని రామిరెడ్డిపల్లి పంచాయతి, ఒడ్డుపల్లికి చెందిన ఉదయ్ కుమార్(28)కు రామిరెడ్డిపల్లికి చెందిన వివాహిత హేమశ్రీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. హేమశ్రీ(25)కి భర్త వెంకటేశ్వర రెడ్డి ద్వారా ఇద్దరు కవల పిల్లలు పుట్టారు.
https://10tv.in/gujarat-mumbai-man-booked-for-teens-rape/
ఉదయ్ హేమశ్రీల మధ్య ఏం జరిగిందో, ఏమో తెలీదు కానీ ఏడాది వయస్సున్న తన ఇద్దరు కవల పిల్లలు పునీత్, పునర్విలతో కలిసి మంగళవారం ఉదయం చింతపర్తివారి ప్లలె,నడిమోడు కుంట చెరువులో దూకి ఆత్నహత్యాయత్నం చేసుకున్నారు.



ctr suicide attempt 2ప్రాణంమీది ఆశతో కాసేపటికి హేమ, ఉదయ్ ఒడ్డుకు వచ్చేశారు. పిల్లలు ఇద్దరూ నీట మునిగి చనిపోయారు. ఒడ్డుక వచ్చిన హేమ అప్పటికే అపస్మారక స్ధితిలోకి చేరుకుని పక్కనే ఉన్న పొదల్లో పడిపోయింది. కొంచెం స్పృహలోనే ఉన్న ఉదయ్ 108కి ఫోన్ చేసి సమాచారం అందించారు.  వారు వచ్చి పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. గ్రామస్తుల సమచారంతో ఘటనా స్ధలానికి పోలీసులు చేరుకుని  విచారణ చేపట్టారు.   ఉదయ్, హేమశ్రీలను ఆస్పత్రికి తరలించి, హేమ భర్త వెంకటేశ్వరె రెడ్డికి సమాచారం అందించారు.