Mekapati Chandrasekhar Reddy: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు.. నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స

ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు ఛాతీలో అసౌకర్యంగా అనిపించింది. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Mekapati Chandrasekhar Reddy: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు.. నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స

Updated On : February 8, 2023 / 2:37 PM IST

Mekapati Chandrasekhar Reddy: ఆంధ్రప్రదేశ్, ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు ఛాతీలో అసౌకర్యంగా అనిపించింది. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Google Bard: ‘చాట్‌జీపీటీ’కి పోటీగా గూగుల్ ‘బార్డ్’.. బ్లాగ్ ద్వారా వెల్లడించిన సుందర్ పిచాయ్

అక్కడ చంద్రశేఖర్ రెడ్డిని పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు గుర్తించారు. గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో రెండు చోట్ల పూడికలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, మెరుగైన చికిత్స కోసం చెన్నై తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్సార్సీపీ నుంచి ఉదయగిరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నాలుగుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు.