Union Minister Amit Shah: విశాఖలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన.. భారీ బహిరంగ సభ.. షెడ్యూల్ ఇలా..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గంలో 6.10 గంటలకు రైల్వే గ్రౌండ్‌కు చేరుకుంటారు.

Amit Shah
Amit Shah: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బలోపేతం అయ్యేలా బీజేపీ (BJP) కేంద్ర అధిష్టానం దృష్టిసారించింది. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నాటికి బలమైన పార్టీగా ఎదిగేందుకు ఆ పార్టీ కేంద్ర పెద్దలు వ్యూహాలకు పదునుపెట్టారు. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేతలు ఏపీలో పర్యటనలు షురూ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా (JP Nadda) శనివారం ఏపీలో పర్యటించారు. శ్రీకాళహస్తిలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొని బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. మురుసటి రోజు (ఆదివారం) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) ఏపీలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం విశాఖ పట్టణం (Visakhapatnam) లోని రైల్వే పుట్‌బాల్ గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గంలో 6.10 గంటలకు రైల్వే గ్రౌండ్‌కు చేరుకుంటారు. రైల్వే పుట్‌బాల్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. 7.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి నగరంలోని పోర్టు అతిథి గృహానికి వెళ్తారు. అనంతరం సాగరమాల ఆడిటోరియంలో బీజేపీ నాయకులతో సమావేశం అవుతారు. రాత్రి 9.05 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 9.25 గంటలకు విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 9.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.45 గంటలకు అమిత్ షా ఢిల్లీకి చేరుకుంటారు.
వాస్తవానికి అమిత్ షా ఈనెల 8న విశాఖపట్టణంకు రావాల్సి ఉంది. కానీ వేరే కార్యక్రమాలు ఉన్నందున పర్యటన వాయిదా పడింది. తిరిగి ఆదివారం ఆయన విశాఖపట్టణం రానున్నారు.అమిత్ షా సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నందున ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి అమిత్ షా ఢిల్లీ విమానం ఎక్కేవరకు పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టింది.