Varla Ramaiah: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ మరణం హత్యే: వర్ల రామయ్య

దర్యాప్తు పూర్తికాకముందే ఆత్మహత్య అని జిల్లా ఎస్పీ ఎలా చెబుతారని వర్ల రామయ్య నిలదీశారు.

Varla Ramaiah: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ మరణం హత్యే: వర్ల రామయ్య

Varla Ramaiah

Updated On : June 29, 2023 / 4:06 PM IST

Varla Ramaiah – TDP: సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యాన్ శ్యామ్ (Shyam) మరణంపై టీడీపీ వీడియో క్లిప్పింగులను ప్రదర్శించింది. ఆయన మరణం ముమ్మాటికీ హత్యేనన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఇవాళ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సీఎం జగన్ పాలనలో ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని వర్ల రామయ్య చెప్పారు. ప్రతి రోజు హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. దళిత, వెనుకబడిన వర్గాలపై ప్రతి రోజు దాడులు జరుగుతున్నాయని చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శ్యామ్ మణికంఠది ముమ్మాటికి హత్యేనని తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు సరిగ్గా చేయకుండా, దర్యాప్తు పూర్తికాకముందే ఆత్మహత్య అని జిల్లా ఎస్పీ ఎలా చెబుతారని వర్ల రామయ్య నిలదీశారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ఎస్పీకి మంచిది కాదని చెప్పారు. శ్యామ్ ఆత్మహత్య వీడియో ఒరిజినల్ కాదని తెలిపారు. అది వైసీపీ సోషల్ మీడియా ఎడిట్ చేసిన వీడియోనని చెప్పారు.

KTR: తెలంగాణలో ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది: కేటీఆర్