Vasireddy Padma : హంతకుడు అని ఎలా అంటారు? చంద్రబాబును మించిన ఊసరవెల్లిలా తయారయ్యారు- షర్మిలపై వాసిరెడ్డి పద్మ ఫైర్

రాజకీయాల్లో జగన్ ను ఓడించడమే షర్మిల, సునీత ఆశయమా..? వైఎస్సార్ కు తలవంపులు తెచ్చేలా షర్మిల వ్యవహరం ఉంది.

Vasireddy Padma : హంతకుడు అని ఎలా అంటారు? చంద్రబాబును మించిన ఊసరవెల్లిలా తయారయ్యారు- షర్మిలపై వాసిరెడ్డి పద్మ ఫైర్

Vasireddy Padma

Updated On : April 5, 2024 / 6:35 PM IST

Vasireddy Padma : ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ ఫైర్ అయ్యారు. హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదు అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వాసిరెడ్డి పద్మ. కోర్టులో ఉన్న విషయాలను షర్మిల ప్రస్తావించటం సరికాదన్నారు. షర్మిల నీచమైన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేసు విచారణలో ఉండగా హంతకుడు అని ఎలా అంటారు? అని షర్మిలను ప్రశ్నించారు.

షర్మిల బుర్రలో ఏం అనిపిస్తే అదే నిజమా..? కోర్టు విచారణ జరుగుతుంది కదా..? అని సీరియస్ అయ్యారు. షర్మిలవి పతన రాజకీయాలు అని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కుటుంబంలో చిచ్చు పెట్టే కుట్ర రాజకీయాలు కడప ప్రజలు చాలా కాలంగా చూస్తూనే ఉన్నారని కామెంట్ చేశారు. షర్మిల చంద్రబాబు ఉచ్చులో చిక్కుకోవడం మా దురదృష్టం అని వాసిరెడ్డి పద్మ వాపోయారు.

”విచారణలో ఉన్న అంశాలను, విచారణ జరుగుతోంది, కోర్టు పరిధిలో ఉన్న కేసు మీద.. హంతకులు అని చెప్పి తీర్పు ఈవిడే చెప్పేస్తున్నారు. శిక్ష కూడా ఈవిడే వేసేస్తున్నారు. ఇది అత్యంత నీచమైన రాజకీయం. చంద్రబాబుతో చేతులు కలిసి వైఎస్ఆర్ కుటుంబాన్ని విడదీయాలని చేస్తున్న కుట్రలు కడప ప్రజలకు కొత్తేమీ కాదు. మిమ్మల్ని పావులుగా మార్చుకుని ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడించటం దురదృష్టకరం. ఏం సాధించాలని మీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు” అని షర్మిలపై చెలరేగిపోయారు వాసిరెడ్డి పద్మ.

స్వార్థ ప్రయోజనాల కోసమే షర్మిల, సునీతా.. చంద్రబాబుతో చేతులు కలిపారని ఆమె ఆరోపించారు. ప్రత్యేక హోదా చట్టంలో పెట్టకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని మండిపడ్డారు. రాజకీయాల్లో షర్మిల.. చంద్రబాబును మించిన ఊసరవెల్లిలా తయారయ్యారని విరుచుకుపడ్డారు. మొన్నటివరకు తెలంగాణ అన్నారు.. ఇప్పుడు ఏపీ అంటున్నారు.. ఇన్ని యూ టర్న్ లు ఎందుకు తీసుకుంటున్నారు..? ఏం ఆశించి..? అని షర్మిలను నిలదీశారు వాసిరెడ్డి పద్మ.

ఈరోజు అవినాశ్ ను అన్నారు.. రేపు జగన్ ను కూడా అంటారు. రాజకీయాల్లో జగన్ ను ఓడించడమే షర్మిల, సునీత ఆశయమా..? వైఎస్సార్ కు తలవంపులు తెచ్చేలా షర్మిల వ్యవహరం ఉంది అంటూ షర్మిల, సునీతా టార్గెట్ గా నిప్పులు చెరిగారు వాసిరెడ్డి పద్మ.

Also Read : ఎమ్మెల్యే వెలగపూడి విజయ పరంపరకు బ్రేక్ పడుతుందా? విశాఖ తూర్పులో రసవత్తర పోరు