Velampalli Srinivasarao : లోకేష్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. లేకుంటే టీడీపీని మూసేస్తారా? : వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడలో ప్రజాధరణ లేకపోవడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి జనాలను పాదయాత్రకు రప్పించారని ఎద్దేవా చేశారు. జగన్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి టీడీపీ నుంచి వైసీపీలో చేరారని శ్రీనివాసరావు తెలిపారు.

Velampalli Srinivasarao
Velampalli Srinivasarao – Chandrababu -Lokesh : టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు బెజవాడకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. తమ హయాంలో జగన్ ఏం ఇచ్చారో తాము చెప్పగలమని అన్నారు. ఈ మేరకు శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును వైజాగ్ మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలని వ్యాఖ్యానించారు. మహిళలకు రాఖీ పంపిస్తాను.. 45 రోజులు జపం చేయమని చెప్పడానికి చంద్రబాబు ఏమైనా దేవుడా అని ప్రశ్నించారు. బలం లేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.
లోకేష్ యువగళం పాదయాత్ర, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు, చంద్రబాబు కార్యక్రమాలకు జనాలు లేక చంద్రబాబుకు మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు. లోకేష్ కు దమ్మూ, ధైర్యం ఉంటే పశ్చిమలో పోటీ చేయాలని సవాల్ చేశారు. లోకేష్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేకుంటే టీడీపీని మూసేస్తారా అని ఛాలెంజ్ చేశారు. నారా లోకేష్ విజయవాడ పశ్చిమకు పది నిమిషాలు హాల్టింగ్ కు వచ్చాడని, ఎందుకు వస్తున్నాడో ఎందుకు వెల్తున్నాడో అర్థం కావడం లేదన్నారు.
Abbayya Chowdary : దమ్ముంటే 2024 ఎన్నికల్లో నన్ను ఎదుర్కో.. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి సవాల్
విజయవాడలో ప్రజాధరణ లేకపోవడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి జనాలను పాదయాత్రకు రప్పించారని ఎద్దేవా చేశారు. జగన్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి టీడీపీ నుంచి వైసీపీలో చేరారని శ్రీనివాసరావు తెలిపారు. జగన్ గేట్లు తెరిస్తే టీడీపీ నుంచి ఏ ఒక్కరూ ఉండరని పేర్కొన్నారు. వైసీపీలో ఉన్నవారు ఎవరూ పార్టీని వదిలివెళ్లరని స్పష్టం చేశారు. నారా లోకేష్ విజయవాడలో యాత్ర చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తమది చంద్రబాబు లాగా శంకుస్ధాపనలు చేసే పార్టీ కాదన్నారు. శంకుస్థాపనలతో పాటు నిర్మించేది కూడా తామేనని చెప్పారు. నారా లోకేష్ విజయవాడ వదిలే లోపు తన సవాల్ ను స్వీకరించు లేదంటే ఈవినింగ్ వాక్ చేసుకొని వెళ్లిపో అని ఉచిత సలహా ఇచ్చారు. తాము అడ్డుకుంటే లోకేష్ పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు. లోకేష్ కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువని ఎద్దేవా చేశారు.
విజయవాడ నగరాన్ని పాడు చేయాలని టీడీపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
Yuvagalam Padayatra : లోకేష్ యువగళం పాదయాత్ర 2500 కిలోమీటర్లు పూర్తి.. కృష్ణా జిల్లాలోకి ప్రవేశం
పశ్చిమ టీడీపీకి నాయకుడు ఎవరని ప్రశ్నించారు. కేశినేని నాని పాదయాత్రలో ఉన్నారా అని అడిగారు. తమను రెచ్చగొడితే నారా లోకేష్ ఒక్క అడుగు కూడా వేయలేరని హెచ్చరించారు. లోకేష్ పాదయాత్ర వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. బెజవాడలో తాము చేసిన అభివృద్ధిని చూసుకుని తండ్రి, కొడుకులు చేయలేక పోయామని లెంపలేసుకుని వెళ్లాలని చంద్రబాబు, లోకేష్ ను ఉద్దేశించి మాట్లాడారు.