ఆదుకోండి ప్లీజ్.. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్

కరోనాతో రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిన్నదని, కేంద్రం ఆదుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని..సీఎం జగన్ కోరారు. ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉంది ? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జగన్ వివరించారు. 2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. వారి వారి రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ..
గడిచిన రెండు రోజుల్లో కేసుల సంఖ్య పెరగడానికి కారణాలు వివరించారు. నమోదైన కేసుల్లో 111 జమాత్ కు వెళ్లిన వారని, వారితో కాంటాక్టులో ఉన్న వారేనని చెప్పారు. కుటుంబం వారీగా సర్వే చేయడం జరుగుతోందని, వీరికి క్వారంటైన్, ఐసోలేషన్‌కు తరలించి వైద్య సదుపాయాలు అందిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిందని తగిన విధంగా ఆదుకోవాలని కోరారు. అలాగే..మెడికల్ పరికరాలను తగిన సంఖ్యలో అందించాలని కోరారు సీఎం జగన్.
* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
* 2020, మార్చి 02వ తేదీ గురువారం 132 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
* బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల మధ్య 43 కొత్త కేసులు నమోదైనట్లు బులిటెన్‌లో తెలిపింది.
* ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు పేర్కొంది.
* రాష్ట్రంలో వైరస్ భయం నెలకొంది.
* రాష్ట్రంలో నమోదవుతున్న కేసులను చూసి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
* ఇటీవల ఢిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
* ఢిల్లీ నుంచి వచ్చిన వారిలోనే ఎక్కువగా కరోనా.
* వైరస్ నుంచి కోలుకున్న నలుగురు బాధితులు.
* రాష్ట్రాన్ని భయం గుప్పిట్లోకి నెట్టేస్తున్న కోవిడ్.
Also Read | డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా తల్లీబిడ్డకు కరోనా