టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమిపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

గతంలో ఎన్డీయేలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం మేలు చేశాడో చెప్పాలని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమిపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Vijayasai Reddy

Updated On : March 10, 2024 / 4:01 PM IST

YCP Siddham Sabha : టీడీపీ- బీజేపీ – జనసేన పార్టీల కూటమిపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 10టీవీతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదు.. దేశంలోని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడనంటూ విమర్శించారు. గతంలో ఎన్డీయేలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం మేలు చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు చేసేది ఏమీ ఉండదు. చంద్రబాబు పొత్తుల్లో నిజాయితీ నిబద్ధత ఉండదు. సిద్దాంతాలు ఆధారంగా ఈ పొత్తులు ఏమీలేవు.. జగన్ మోహన్ రెడ్డిని ఓడించాలని మాత్రమే అందరినీ కలుపుకున్నారంటూ విజయసాయిరెడ్డి అన్నారు. అదేవిధంగా సిద్ధం సభకు అన్ని ఏర్పాటు పూర్తయ్యాయని, ఈ సభకు 15లక్షల మందికి తక్కువ కాకుండా ప్రజలు వస్తున్నారని, ఆరు జిల్లాల్లో గ్రామాల నుంచి అనుకున్న దానికంటే ఎక్కువగా స్పందన వచ్చిందని విజయసాయిరెడ్డి అన్నారు. ఇవాళ్టి సభలో జగన్ ప్రసంగంలో కీలకమైన అంశాలు ఉంటాయని విజయసాయి రెడ్డి చెప్పారు.

Also Read : Mudragada : ఈనెల 14న వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం!

వైసీపీ నేత అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 99శాతం మ్యానిఫెస్టో ను అమలు చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ మాటను మా క్యాడర్ ప్రజలకు చేరవేసింది. ప్రజలు మాకు 151 సీట్లు ఇచ్చారు. ఈసారి 175 సీట్లు ఇవ్వబోతున్నారని అన్నారు. ఆనాడు చెప్పిన మాటలన్నీ జగన్ గత ఐదేళ్లుగా అమలు చేశారు. ప్రజలకు మంచి చేశాం కనుకే మేము ప్రజల్లోకి ధైర్యంగా వెళ్తున్నాం. చెప్పినవన్నీ చేశాం.. అనే విషయాన్ని ప్రజలకు చెప్పి మళ్లీ ఓట్లు అడుగుతాం. ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు మా పార్టీకి మాత్రమే ఉంది. ఎన్నికల్లో ఎంత మంది కలిసొచ్చినా వార్ వన్ సైడే అవుతుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డిలా  మంచి జరిగితేనే ఓటు వెయ్యండి అని దమ్ముగా అడిగే నాయకుడు ఎవరూ లేరని అన్నారు.

Ambati Rambabu : జనసేనాని పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ మంత్రి అంబటి ట్వీట్..!