vijaya sai reddy : విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి..! కొత్తపార్టీపై కీలక ప్రకటన.. టార్గెట్ వారేనా..? ఎవరికి నష్టం..
vijaya sai reddy : హైదరాబాద్లోని తన నివాసంలో ఈడీ సోదాలు ముగిసిన తరువాత విజయసాయిరెడ్డి మీడియా ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఆయన ఈడీ సోదాలు, తన పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక కామెంట్స్ చేశారు.
vijaya sai reddy
- మళ్లీ రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి
- జూలై నెలలో రీఎంట్రీ ఉంటుందని వెల్లడి
- ఏపీలో కొత్త రాజకీయ పార్టీ అవసరమంటూ వ్యాఖ్య
- విజయసాయిరెడ్డి టార్గెట్ వారేనా?
vijaya sai reddy : వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన విషయం తెలిసిందే. వైసీపీలో నెం.2గా, జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా పేరుపొందిన ఆయన.. ఆ పార్టీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి దూరమయ్యారు. ఆ తరువాత సోషల్ మీడియా ద్వారా వివిధ రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను విజయసాయిరెడ్డి పంచుకుంటూ వస్తున్నారు. అయితే, తాజాగా.. ఆయన మీడియాతో మాట్లాడుతూ మళ్లీ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు చెప్పిన ఆయన.. కొత్త పార్టీ అవసరం ఉందంటూ పేర్కొనడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read : AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. వారందరికీ శుభవార్త.. వెంటనే ఇలా చేయండి..
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు విచారణలో బాగంగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సుమారు 13గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. శుక్రవారం ఈడీ సోదాలు ముగిసిన తరువాత విజయసాయిరెడ్డి మీడియా ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఆయన ఈడీ సోదాలు, తన పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక కామెంట్స్ చేశారు.
తన నివాసంలో జరిగిన సోదాల్లో ఈడీ అధికారులకు ఏమీ లభించలేదని, అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం ఇచ్చానని, విచారణకు పూర్తి స్థాయిలో సహకరించానని విజయ సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో పొలిటికల్ రీ ఎంట్రీ పై ఆయన కీలక కామెంట్స్ చేశారు. జులై నెలలో మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ముఖ్యంగా ఏపీ రాజకీయల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇది ఆయన సొంత పార్టీ పెట్టబోతున్నారనే సంకేతమా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయాలతో పాటు త్వరలోనే తాను మీడియా రంగంలోకి కూడా అడుగు పెడుతున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. రాజకీయాల్లోకి వచ్చాక చంద్రబాబు అవినీతి భాగోతాన్ని ఎండగడుతానని, మళ్లీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన దుష్ట రాజకీయాల అంతు చూస్తానంటూ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఇదే సమయంలో వైసీపీ తీరుపైనా విజయసాయిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు సరైన బుధ్ది చెప్పారని, ఆ పార్టీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి బుద్ధి తెచ్చుకోవాలని విజయసాయిరెడ్డి ఘాటుగా విమర్శించారు. ఇకనైనా నాయకులు అహంకారాన్ని వీడి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ అంశంపై ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. టీడీపీతోపాటు వైసీపీపైనా ఆయన విమర్శలు చేయడం గమనార్హం. ఏపీ రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీతో రీఎంట్రీ ఇస్తే ఏ పార్టీకి ఎక్కువ నష్టం చేస్తుందనే అంశాలపై రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. విజయసాయిరెడ్డి మొదటి నుంచి టీడీపీ వ్యతిరేకిగా.. వైసీపీ మనిషిగానే రాజకీయాల్లో గుర్తింపు పొందారు. దీంతో ఆయన్ను అభిమానించేవారు ఎక్కువగా వైసీపీలోనే ఉంటారు. దీంతో ఆయన కొత్త రాజకీయ పార్టీతో పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తే కొంత వైసీపీకే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, విజయసాయిరెడ్డి నిజంగానే కొత్త పార్టీతో పొలిటికల్ రీ ఎట్రీ ఇస్తారా..? లేదంటే మళ్లీ వైసీపీలో లేదంటే బీజేపీలో చేరుతారా అనే అంశాలపై కూడా ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. మరి విజయసాయిరెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ ఏ విధంగా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.
