నువ్వు నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు బతుకుతున్నారా బాబూ? – విజయసాయి

  • Published By: madhu ,Published On : February 26, 2020 / 08:44 AM IST
నువ్వు నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు బతుకుతున్నారా బాబూ? – విజయసాయి

Updated On : February 26, 2020 / 8:44 AM IST

టీడీపీ చేస్తున్న విమర్శలను ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. బాబు టార్గెట్‌గా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. కుప్పంలో టీడీపీ నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రపై వైసీపీ కౌంటర్ ఇస్తోంది. బాబు చేసిన విమర్శలను వైసీపీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా 2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం పలు ట్వీట్స్ చేశారు. 

* కుప్పం వెళ్లి అన్న క్యాంటీన్లు రద్దు చేశారని వాపోయాడని బాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. పేద వాళ్లకు తిండి దొరకకుండా చేశారట…9 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల్లో రూ.5 భోజనం కోసం ఎదురుచూసే వాళ్లుండటమేమిటి? అంటూ ప్రశ్నించారు. కుప్పంలో పేదరికమే లేదని గంటాపథంగా చెప్పాల్సిన వాడివి. ఇంత దీనపు పలుకులు ఏమిటి ? అంటూ సెటెర్స్ వేశారు. 

* సీఎం జగన్ నాలుగు నెలల్లోనే రివర్స్ టెండర్ విధానంలో రూ.2000 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేశారంటూ చెప్పుకొచ్చారు. నువ్వు అధికారంలో ఉంటే 15% ఎక్సెస్ లు, నామినేషన్లతో పనులు కట్టబెట్టి రూ.15 వేల కోట్లు దోచుకునేవాడివంటూ విమర్శించారాయన. పరిపాలన అంటే లూటీ చేయడమే అన్న ఫిలాసఫీ కదా నీది. ఎవరేంటో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. 

* వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు  ఫ్లెక్సీలు కట్టుకోవద్దట. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడు. నువ్వు నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు బతుకుతున్నారనుకుంటున్నావా బాబూ? ఎవడబ్బ సొమ్మని ఫ్లెక్సీలు కడతారని చించుకుంటున్నావు. 14 ఏళ్లు సీఎంగా చేసినోడివి ఇంతగా పతనమవుతావని అనుకోలేదంటూ  విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్స్ వైరల్‌గా మారుతున్నాయి.