ACB Court : జైలులో చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేయాలని.. విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశం
ప్రభుత్వ వైద్యుల సూచన మేరకు జైలులో చల్లటి వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని మాత్రమే చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను న్యాయమూర్తి ఆన్ లైన్ ద్వారా విచారణ చేపట్టారు.

Chandrababu AC Jail
ACB Court Allowed AC : టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఏసీ ఏర్పాటు చేసేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. చంద్రబాబు అనారోగ్యం దృష్ట్యా ఏసీ సౌకర్యం కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పిటిషన్ ను ఆన్ లైన్ ద్వారా విచారించారు. చంద్రబాబు ఉన్న బ్యారెక్ లో తక్షణమే ఏసీ ఏర్పాటు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు లాయర్ల హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రభుత్వ వైద్యుల సూచన మేరకు జైలులో చల్లటి వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని మాత్రమే చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను న్యాయమూర్తి ఆన్ లైన్ ద్వారా విచారణ చేపట్టారు. అత్యవసరంగా టవర్ ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఆన్ లైన్ లో చంద్రబాబు తరపున లూధ్రా, గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపించారు.
Arun Kumar : మోదీ, జగన్ కలిసే ఆ పని చేస్తున్నారు : అరుణ్ కుమార్
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని న్యాయమూర్తికి వివరించామని న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు తెలిపారు. చల్లటి వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరామని పేర్కొన్నారు. ఆన్ లైన్ లో న్యాయమూర్తి విచారణ చేశారని తెలిపారు. తమ వైపు లూధ్రా, తాను వివరించానని పేర్కొన్నారు. సీఐడీ తరపున వివేకానంద వాదనలు వినిపించారని వెల్లడించారు. జైల్లో చంద్రబాబుకు టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారని తెలిపారు.