Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రులు.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

సరస్వతి దేవిగా బంగారు వీణ దరించి దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతిగా శక్తి రూపాలతో శిష్ట సంహారం చేసి దుర్గాదేవి తన నిజ స్వారూపంతో సాక్షాత్కరింప చేస్తూ సరస్వతి దేవిగా దర్గమ్మ దర్శనం ఇస్తున్నారు.

Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రులు.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

Vijayawada Sarannavaratri

Updated On : October 20, 2023 / 8:27 AM IST

Indrakeeladri Sarannavaratri : విజయవాడలో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవారు సర్వస్వతి దేవిగా దర్శనమిస్తున్నారు. కనకదుర్గమ్మ జన్మ నక్షత్రమైన ఈరోజుకు శుక్రవారం కూడా కలిసి వచ్చింది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. రాత్రి 2 గంటల నుంచి సరస్వతి దేవి దర్శనార్థం భక్తులను అధికారులు అనుమతించారు. ముఖ్యమంత్రి జగన్ ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోబోతున్నారు.

ఇవాళ మూల నక్షత్రం కావడంతో అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయానికి జగన్ చేరుకోనున్నారు. సరస్వతి దేవిగా బంగారు వీణ దరించి దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతిగా శక్తి రూపాలతో శిష్ట సంహారం చేసి దుర్గాదేవి తన నిజ స్వారూపంతో సాక్షాత్కరింప చేస్తూ సరస్వతి దేవిగా దర్గమ్మ దర్శనం ఇస్తున్నారు.

Navaratri 2023 : జ్ఞాన సంపద ప్రసాదించే చదువుల తల్లి ‘శ్రీ సరస్వతీ దేవి’

మూలా నక్షత్రం నుండి విజయ దశమి వరకు పుణ్య దినాలు కావడంతో అమ్మవారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. ఇవాళ దాదాపుగా రెండున్నర లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. దీంతో ఇంద్రకీలాద్రిపై 6 వేల 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటైంది. క్యూలైన్లు ఎప్పటికప్పుడు సజావుగా సాగే విధంగా సీసీ కెమెరాల ద్వారా పోలీసులు మానిటరింగ్ చేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఫ్రోటోకాల్, విఐపీ దర్శనాన్ని రద్దు చేశారు.

Vijayawada