సిఎంఆర్ఎప్‌కు విరాళాల వెల్లువ..
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వరద భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.

Vikram Narayana Rao Family donates one crore 55 lakh rupees to AP CM Relief fund
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వరద భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. వరద బాధితులను ఆదుకునేందుకు ఎంతో మంది దాతలు ముందుకు వస్తున్నారు. సామాన్యులు మొదలు కొని.. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తమకు తోచినంత విరాళంగా అందిస్తున్నారు. తాజాగా పర్చూరు నియోజకవర్గం గొనసపూడి గ్రామం నుండి వచ్చిన విక్రం నారాయణ కుటుంబం సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం అందించింది.
సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి కోటి 55 లక్షల 55 వేల 555 రూపాయలు చెక్‌ను అందించారు. ఈ క్రమంలో వరద బాధిత కుటుంబాలకు, ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు విక్రం నారాయణ కుటుంబాన్ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
లైన్ క్లియర్.. రోజా రిటర్న్స్.. ఏం జరుగుతోందో తెలుసా?
ఈ సందర్భంగా రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రజలకు అండగా నిలిచిన విక్రం నారాయణ కుటుంబాన్ని అభినందించారు. విక్రం నారాయణ రావు మాట్లాడుతూ.. తాము ఒకప్పుడు విజయవాడలోని సింగ్ నగర్ లో ఉండేవాళ్లం అని చెప్పారు. సింగ్ నగర్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధంతో విజయవాడ ప్రజలకు తమ వంతుగా సాయం చేయాలని ముందుకు వచ్చినట్లుగా చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ కుటుంబం ఎల్లప్పుడు తోడుగా ఉంటుందంటూ హామీ ఇచ్చారు. ప్రస్తుతం నారాయణ కుటుంబం ముంబైలో ఫార్మాస్యూటికల్ కంపెనీని నిర్వహిస్తోంది.