వారం క్రితం గెలిచిన విశాఖ కార్పొరేటర్ మృతి

Visakha Corporator Suryakumari Dies1
Visakha Corporator Dies: విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విశాఖ 61 వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన సూర్యకుమారి అనే మహిళ ఆకస్మికంగా మృతి చెందారు. విశాఖ పారిశ్రామిక వాడలో కుటుంబంతో కలిసి ఉంటున్న సూర్యకుమారి ఆదివారం రాత్రి సమయంలో మృతి చెందారు. సూర్యకుమారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సూర్యకుమారి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆమె ఇంటికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఎవరైనా హత్యచేసి ఉంటారా? లేదంటే అనారోగ్య కారణంతో చనిపోయారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సూర్యకుమారి మృతిపై విశాఖ వైసీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని, విశాఖ మేయర్ పదవిని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.