visakha : విశాఖలో రెండు గ్రామాల మత్య్సకారుల మధ్య ఘర్షణ..బోటుకు నిప్పు

విశాఖలో పెద్దజాలరిపేట, చిన్నజాలరిపేట మత్స్యకారుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఓ వర్గం రింగు వలలతో వేటకు వెళ్లడంతో మరోవర్గం వారిని అడ్డుకుంది. దీంతో కొంతమంది ఓ బోటుకు నిప్పు పెట్టారు

visakha : విశాఖలో రెండు గ్రామాల మత్య్సకారుల మధ్య ఘర్షణ..బోటుకు నిప్పు

Clashes Between Fishermen Groups In Visakha

Updated On : January 4, 2022 / 4:22 PM IST

clashes between fishermen groups in visakha : విశాఖలో పెద్దజాలరిపేట, చిన్నజాలరిపేట మత్స్యకారుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఓ వర్గం రింగు వలలతో వేటకు వెళ్లడంతో మరో వర్గం వారిని అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్యా వివాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో కొంతమందికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో సముద్రంలో పడవకు ఓ వర్గం మత్స్యకారులు నిప్పు పెట్టారు. దీంతో వాసవానిపాలెం తీరం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలం వద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాలకు సర్ధి చెప్పేయత్నం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. సముద్రంలోకి వెళ్లిన బోట్లను బయటికి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. తమ బోట్లకు నిప్పు పెట్టారని.. తమ పిల్లలను ఓ వర్గం అపహరించిందని మరో వర్గానికి చెందిన మహిళలు ఆరోపిస్తున్నారు. వలలు కోసేశారని, తమ వాళ్లను కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more : US Covid Cases : అమెరికాలో కోవిడ్ సునామీ..ఒక్కరోజే 10లక్షలకు పైగా కేసులు

రింగ్ వలలతో చేపల వేట చేయకూడదని సంప్రదాయ వలలతో చేపలను వేటాడే మత్స్యకారులు కోరుతున్నారు.ఇదే విషయమై రింగ్ వలలతో చేపల వేటాడే వారితో సంప్రదాయపద్దతిలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు గొడవకు దిగుతున్నారు. ఇదే విషయంపై సోమవారం (జనవరి 4,2022) పెద్దజాలరిపేట, చిన్నజాలరిపేట మత్స్యకారుల గ్రామాలకు చెందిన మత్స్యకారుల మధ్య ఘర్షణ జరిగింది. రింగ్ వలలను నిషేధించాలని సంప్రదాయ మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు పెద్ద ఎత్తున మంగమూరిపేట తీరం వద్దకు చేరుకొన్నారు.దాదాపుగా 50 రోజులుగా సంప్రదాయ చేపల వేటకు వెళ్లే తమకు చేపలు దొరకడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. రింగ్ వలలను నిషేధించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.

Read more : Hyderabad Crime : నగరంలో మోస్ట్ వాంటెడ్ దొంగల ముఠా అరెస్ట్

విశాఖ రింగ్ వలల వివాదంపై మంత్రి సీదిరి అప్పలరాజు స్పందిస్తు..విశాఖ లో మత్స్యకార సోదరుల మధ్య జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. రింగ్ వలల విషయంలో విశాఖ కలక్టేరట్ లో నాలుగు సార్లు సమావేశం జరిగిందనీ..మళ్లీ ఇదే విషయంపై ఘర్షణ జరగడం బాదాకరమని అన్నారు.రింగ్ వలలు ట్రాలింగ్ చేయడం నిషేధమని..రింగ్ వలలు మెరైన్ ఫిషరిస్ యాక్ట్ ప్రకారం ఉపయోగించాలని..8 కిలోమీటర్ల తీరం అవతల,అర ఇంచి కంటే పెద్ద ఖాళీ ఉన్న వలలుమాత్రమే వాడాలని సూచించారు.8 కిలోమీటర్ల లోపల రింగ్ వలలతో వేట చేయడం చట్టపరంగా నేరమని తెలిాపరాు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని..
నిభందనలకు విరుద్దంగా రింగ్ వలలు వాడే వారిపై చర్యలు తీసుకుని .. నెట్ లు ,బోట్ లు సీజ్ చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.రేపు మరో సారి మత్స్యకార పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం మెరైన్ పోలీసులను అప్రమత్తం చేసాం , పరిస్థితి అధుపులోనే ఉందని తెలిపారు.