వికలాంగ బాలికను తల్లిని చేసిన నీచుడు….అరెస్ట్

raped a disbled girl : కామంధులకు ఆడమనిషి కనిపిస్తే చాలు వారు ఎటువంటిస్ధితిలో ఉన్నారో లేదో కూడా చూసుకోవటంలేదు. మృగాలుగా మారి వారిపైలైంగిక దాడి చేస్తున్నారు. ఇలాంటి వారిని శిక్షించటానికి చట్టాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. మానసికస్థితి సరిగా లేని బధిర బాలికపై కొద్ది నెలల కిందట లైంగిక దాడి చేసి…. తల్లిని చేసిన వ్యక్తిని గురువారం జడ్డంగి పోలీసులు అరెస్ట్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు అందించిన వివరాల ప్రకారం……జిల్లాలోని రాజవొమ్మంగి మండలంలోని ఓ గ్రామంలో బధిర బాలిక(14) తాతయ్య వద్ద ఉంటోంది. బాలిక తల్లి విశాఖపట్నంలో ఉంటోంది. అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి తన కుమార్తెను చూసి వెళ్తూ ఉండేది.
ఇదే క్రమంలో కొద్ది నెలల క్రితం కోటవురట్ల మండలం అల్లుమియాపాలెనికి చెందిన దల్లి సింహాచలం అనే వ్యక్తితో కలిసి గ్రామానికి వచ్చి కూతుర్ని చూసి వెళ్లింది. అది డరిగిన కొన్నాళ్లకు తన కుమార్తె గర్భవతి అని తెలుసుకుని ఆమె తనతో పాటే కుమార్తెను విశాఖపట్టణానికి తీసుకు వెళ్లిపోయింది.
కాగా…..అక్టోబర్ 4న ఆ బాలిక ఇంటి వద్దనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పేగు మెడలో వేసుకుని బిడ్డ పుట్టడంతో ఆసుపత్రికి తరలించారు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి మైనర్ అని గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో పోలీసులు తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో జీరో ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేసి….. కేసును జడ్డంగి పోలీసు స్టేషన్‌కు రిఫర్ చేశారు. వారు దర్యాప్తు చేపట్టగా దల్లి సింహాచలమే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. లబ్బర్తి జంక్షన్ వద్ద నిందితుడు దల్లి సింహాచలాన్ని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.