వాలంటీర్ హత్య కేసు.. మాజీమంత్రి విశ్వరూప్‌పై మంత్రి సుభాష్ కీలక వ్యాఖ్యలు..

బాధితురాలు తన దగ్గరికి వచ్చి న్యాయం చేయాలని కోరారని, విచారణకు ఆదేశించడంతో శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారని మంత్రి సుభాష్ వెల్లడించారు.

వాలంటీర్ హత్య కేసు.. మాజీమంత్రి విశ్వరూప్‌పై మంత్రి సుభాష్ కీలక వ్యాఖ్యలు..

Volunteer Durga Prasad Case

Updated On : October 21, 2024 / 9:22 PM IST

Volunteer Case : వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని అతడి భార్య సంధ్య డిమాండ్ చేశారు. మాజీమంత్రి కుమారుడు పినిపె శ్రీకాంత్ కు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారామె. రెండున్నరేళ్లుగా తాను కాళ్లు అరిగేలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగానని, కానీ పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. మంత్రి సుభాష్ ను కలవడంతో కేసు దర్యాఫ్తును ప్రారంభించారని చెప్పారామె. తన కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా చేశారని దుర్గప్రసాద్ భార్య కన్నీటి పర్యంతం అయ్యారు.

వాలంటీర్ హత్య కేసులో మాజీమంత్రి పినిపె విశ్వరూప్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి సుభాష్. విశ్వరూప్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్ దుర్గాప్రసాద్ పినిపె శ్రీకాంత్ ప్రధాన అనుచరుడు అని చెప్పారాయన. బాధితురాలి ఇంటికి వెళ్లి కేసు పెట్టొద్దని విశ్వరూప్ కోరారని తెలిపారు. విచారణ చేయించకుండానే కేసును క్లోజ్ చేశారని అన్నారు. బాధితురాలు తన దగ్గరికి వచ్చి న్యాయం చేయాలని కోరారని, విచారణకు ఆదేశించడంతో శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారని మంత్రి సుభాష్ వెల్లడించారు.

‘దుర్గాప్రసాద్ అనే వ్యక్తి వాలంటీర్. పినిపె శ్రీకాంత్ కి ప్రధాన అనుచరుడు. ఇంకా ఎవరికీ తెలియని విషయం ఏంటంటే.. దుర్గాప్రసాద్ కి ఒక కొడుకు ఉన్నాడు. అతడి పేరు శ్రీకాంత్. ఆ పేరు ఎందుకు పెట్టుకున్నాడంటే.. శ్రీకాంత్ పై ఉన్న అభిమానంతోనే. అది అందరూ గమనించాలి. ఒకరోజు మంత్రిగా ఉన్న సమయంలో దుర్గాప్రసాద్ భార్య దగ్గరికి వెళ్లిన విశ్వరూప్.. నీకు రెండు ఎకరాల సైట్ ఇస్తాను, కేసు పెట్టొద్దని చెప్పారు. విశ్వరూప్ తన మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఆ కేసు విచారణ ముందుకు వెళ్లకుండా చేశారు.

విధి లేని పరిస్థితుల్లో బాధితురాలు నా దగ్గరికి వచ్చింది. ఈ కేసును తేల్చండి. లేదంటే రెండు ఎకరాలు ఇస్తామన్నారు. అదైనా ఇప్పించండి అని కోరారు. అది ఎలాగూ ఇప్పించలేదు. వారికి తినడానికి తిండి లేదు. నేను డీజీ, ఐజీ దగ్గరికి తీసుకెళ్లి ఫిర్యాదు ఇవ్వడం, నిజనిర్ధారణ చేయమని అడగటం జరిగింది” అని మంత్రి సుభాష్ అన్నారు.

 

 

Also Read : మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక..! అమల్లోకి రానున్న మరో కొత్త పథకం..