విజయసాయిరెడ్డి నిజంగానే వ్యవసాయం కోసమే రాజకీయాలకు గుడ్‌బై చెప్పారా?

రాజకీయ వ్యవసాయం చేస్తున్నారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

విజయసాయిరెడ్డి నిజంగానే వ్యవసాయం కోసమే రాజకీయాలకు గుడ్‌బై చెప్పారా?

VijaySai Reddy

Updated On : February 3, 2025 / 8:03 PM IST

వైసీపీ అధినేత జగన్‌కు ఆప్తుడు ఆయన. 15ఏళ్లుగా నమ్మినబంటుగా ఆయన వెన్నంటి నడిచారు విజయసాయిరెడ్డి. ఏమైందో ఏమో తెలియదు కానీ..కొన్నాళ్లుగా అధిష్టానంతో గ్యాప్‌, సొంత ఎజెండాతో పనిచేశారన్న ప్రచారం నేపథ్యంలో ఫ్యాన్‌ పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లడం లేదని..పాలిటిక్స్‌కు దూరంగా ఉండి వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. అలా ప్రెస్‌మీట్‌ పెట్టి, ట్వీట్ చేసి మరీ పది రోజులు కూడా అయిపోలేదు. అప్పుడే ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు విజయసాయిరెడ్డి.

వైసీపీలో నంబర్-2గా ఉంటూ పదిహేనేళ్ళుగా తెలుగు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విజయసాయిరెడ్డికి ఒక్కసారిగా రాజకీయ వైరాగ్యం కమ్ముకుంది. నాకొద్దీ రాజకీయం అని ఫైన్ మార్నింగ్ అనేసుకున్నారు. అంతే స్పీడ్‌గా పెద్ద ట్వీట్ రాసుకొచ్చారు. డేట్ టైం చెప్పి మరీ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక నుంచి రాజకీయాల గురించి మాట్లాడితే ఒట్టు అని పెద్ద మాటే చెప్పారు. కానీ వారం, పది రోజులు అయిపోలేదు.

కాంగ్రెస్‌లో కల్లోలం రేపుతున్న వరుస ఇష్యూస్.. ఇది హస్తం పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ..

మళ్లీ పొలిటికల్ ట్వీట్లు
అప్పుడే స్టీరింగ్‌ తిప్పేశారు. మళ్లీ పొలిటికల్ ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాదు విజయసాయిరెడ్డి నాలుగు రోజుల కింద హైదరాబాద్‌లోని షర్మిల ఇంటికి వెళ్లి..దాదాపు మూడు గంటల పాటు భేటీ అయ్యారని టాక్. అక్కడే లంచ్ కూడా చేశారట. ఈ విషయం ఇప్పుడు అటు వైసీపీ, ఇటు కాంగ్రెస్‌లో చర్చకు దారితీస్తోంది. గతంలో తాను చేసిన విమర్శలపై షర్మిలకు క్లారిటీ ఇచ్చారట విజయసాయిరెడ్డి. అయితే ఈ ఇద్దరు ఫ్యూచర్‌లో ఒకే ప్లాట్‌ ఫామ్‌ మీద పాలిటిక్స్ చేయబోతున్నారన్న గుసగుసలు మొదలయ్యాయి.

షర్మిలతో భేటీ సంగతి అట్లుంటే..జగన్ లండన్ నుంచి తిరిగి వస్తున్న వేళ ఆయనకు పంపించిన లేఖలోనూ రాజకీయాల గురించే ప్రస్తావించారు విజయసాయిరెడ్డి. వైసీపీ మళ్ళీ 2029లో అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. దీంతో రాజకీయాలు వద్దనుకున్న వేళ మళ్ళీ ఈ పొలిటికల్‌ లవ్‌ లెటర్లేమిటీ అన్న చర్చ జరుగుతోంది.

బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ గురించి ట్వీట్‌ చేసి చర్చకు దారి తీశారు విజయసాయిరెడ్డి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మిడిల్ క్లాస్ బడ్జెట్‌గా చరిత్రలో నిలిచిపోతుందని రాసుకురావడం హైలెట్. ఆయన ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్‌ను పొగుడుతున్నారంటే..బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.

కేంద్ర పెద్దలకు ధన్యవాదాలు
ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పినపుడు కేంద్ర పెద్దలకు ధన్యవాదాలు చెప్పుకున్నారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ బాగుందని అంటున్నారు. అయితే రాజకీయాలకు దూరమని చెప్పి..ఓవైపు వైసీపీపై స్వీట్‌ వాయిస్‌ వినిపిస్తుండటం..బీజేపీ కోసం బ్యాండ్‌ బాజా మోయిస్తూ..షర్మిలతో భేటీ అయ్యి..పొలిటికల్‌ హాట్ టాపిక్‌ అవుతున్నారు విజయ సాయిరెడ్డి.

అయితే ప్రస్తుతం ఆయన యాక్టీవ్‌గా ఉండటం చూస్తుంటే ..పార్టీకి, ఎంపీ పదవికి రిజైన్‌ వెనుక ఏదో ఒత్తిడి ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. బీజేపీని పొగడటం, మళ్ళీ రాజకీయ ట్వీట్లు చేస్తుండటం బట్టి చూస్తుంటే..సమ్‌ థింగ్‌ ఈజ్‌ దేర్ అన్న టాక్ వినిపిస్తోంది.

అయితే విజయసాయిరెడ్డి నిజంగానే వ్యవసాయం కోసమే రాజకీయాలకు గుడ్‌బై చెప్పారా.? లేక రాజకీయ వ్యవసాయం చేస్తున్నారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తెరవెనుక మంత్రాంగం నడిపి..తన వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకే ఆయన వైసీపీని వీడారని అనుకునేవాళ్లు ఉన్నారు. ఏదైనా రాజకీయాలను వదిలేస్తున్నానని విజయసాయిరెడ్డి ప్రకటించారు కానీ..తన ట్విట్టర్ అకౌంట్‌ను మాత్రం రాజకీయాల కోసమే వాడుకుంటున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భవిష్యత్‌లో విజయసాయిరెడ్డి రాజకీయ వ్యవసాయం ఎలా ఉండబోతుందనేది చూడాలి మరి.