నేను పోలీస్..అంటూ వ్యాపారిని మోసం చేసిన మహిళ

నేను కానిస్టేబుల్..కొత్తగా డ్యూటీ వచ్చా..తీసుకున్న దుస్తుల డబ్బులు ఇచ్చేస్తా…అంటూ ఓ మహిళ వ్యాపారిని మోసం చేసింది. బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో కరపలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..కరప గ్రామంలో…నక్కా శ్రీనివాస్ నివాసం ఉంటున్నాడు.
ఇతను డిగ్రీ చదువుకున్నాడు. కానీ..ఉద్యోగం రాలేదు.. దీంతో రెడీమేడ్ దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే….రెండు వారాల క్రితం దుకాణానికి ఓ మహిళ వచ్చిందని, రూ.3,300 విలువ చేసే దుస్తులు తీసుకుందని నక్కా వెల్లడించారు. కానీ డబ్బుు అడిగితే…కరప పోలీసు స్టేషన్‌కు కొత్తగా వచ్చినట్లు, రేపు డ్యూటీకి వచ్చినప్పుడు తీసుకువచ్చి, ఇచ్చేస్తానని నమ్మకంగా చెప్పిందన్నాడు.
మొబైల్ నెంబర్ ఇవ్వాలని అడగడంతో..బాకీ బుక్‌లో నోట్ చేసుకున్నాడు. అంతేగాకుండా…ఆమె వచ్చిన స్కూటర్ నంబరు కూడా (ఏపీ 05 డీసీ, 9813) నోట్ చేసుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. డబ్బులు లేవు..ఆమె ఆచూకీ తెలియడం లేదు. ఇచ్చిన మొబైల్ నంబరు 9849700844కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్‌లో ఉంది.
వెంటనే కరప స్టేషన్‌కు వెళ్లినట్లు, కానీ అటువంటి వారు ఇక్కడ పని చేయడంలేదని చెప్పడంతో మోసపోయినట్టు గ్రహించాడు. బాధితుడు నుంచి ఫిర్యాదు రాలేదని కరప ఎస్సై డి.రామారావు వెల్లడించారు. అయితే..విచారణలో ఉపేంద్ర అనిల్‌కుమార్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా చిరునామా ఉందని తేలింది.