నిత్య పెళ్లి కుమర్తె, మ్యాట్రిమొనీ సైట్లలో యువకులకు వల, లక్షల వసూలు

డబ్బుల కోసం ఆమె పెళ్లి కుమార్తె అవతారం ఎత్తింది. మ్యాట్రిమొనీ సైట్లలో యువకులకు వల వేస్తూ..వరుస వివాహాలు చేసుకుంటున్న కి‘లేడీ’ గుట్టురట్టు చేశారు పోలీసులు. పెళ్లి చేసుకుని లక్షలు వసూలు చేసిన ఈ మహిళ మూడు పెళ్లిళ్లు చేసుకుంది. చివరకు పోలీసులు చిక్కింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చేసుకుంది.
ఓ మహిళ..తన మేనమామను వివాహం చేసుకుంది. కానీ కొన్ని రోజుల తర్వాత..వీరి సంసారంలో విబేధాలు వచ్చాయి. ఆయన నుంచి విడిపోయింది. డబ్బుు సంపాదించాలనే అత్యాశ ఏర్పడింది.
https://10tv.in/20-year-old-meghalaya-girl-held-captive-sedated-and-tortured-for-months-amid-lockdown/
మ్యాట్రిమొనీ సైట్లలో పేర్లను మారుస్తూ..ఫొటోలను పెట్టింది. ఏ విషయాలు ఇతరులకు తెలియకుండా..జాగ్రత్త తీసుకుంది. స్నేహితురాలికి చెందిన గుర్తింపు పత్రాలను మార్ఫింగ్ చేసింది.
ఇలా…తిరుపతి నగరానికి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక్కడ అదే సీన్.
కొన్ని రోజుల తర్వాత..అతడి నుంచి విడిపోయి కేసు పెట్టింది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ. 25 లక్షలు దండుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన మరో వ్యక్తి సైతం మోసపోయాడు. స్వప్న, హర్షిణి, కావ్య పేరిట మోసం చేసింది. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.