Anantapur Road Accident : ఉద్యోగం కోసం వెళ్తుండగా.. లారీ కింద పడి మహిళ దుర్మరణం

కాగా, వీరికి 7నెలల క్రితమే వివాహం అయింది. ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో భార్య శిల్పను మృత్యువు కబలించింది.

Anantapur Road Accident : ఉద్యోగం కోసం వెళ్తుండగా.. లారీ కింద పడి మహిళ దుర్మరణం

road accident (4)

Updated On : June 7, 2023 / 12:10 PM IST

woman died : అనంతపురం నగర శివారులో విషాదం నెలకొంది. ఉద్యోగం కోసం వెళ్తుండగా లారీ కింద పడి మహిళ దుర్మరణం చెందారు. నాగులగుడ్డం గ్రామానికి చెందిన లక్ష్మన్న, శిల్ప దంపతులు. లక్ష్మన్న తన భార్యకు ఉద్యోగం కోసం భార్యతో కలిసి అనంతపురం బయలుదేరారు.

మార్గం మధ్యలో వడియం పేట క్రాసింగ్ వద్ద వేగం వచ్చిన లారీ కింద భార్య శిల్ప పడింది. తలపై నుంచి లారీ వెళ్లడంతో శిల్ప అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మన్న.. ఏజీఎస్ స్కూల్లో డ్రైవర్ గా పని చేస్తున్నారు. తన భార్య శిల్పకు ఉద్యోగం కోసం బుధవారం ఇంటర్వ్యూకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

Mumbai : సోదరుడు హత్యాయత్నం .. మెడలో దిగిన కత్తితో బైక్ డ్రైవ్ చేస్తు ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి

కాగా, వీరికి 7నెలల క్రితమే వివాహం అయింది. ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో భార్య శిల్పను మృత్యువు కబలించింది. వీరి మృతితో కుటుంబం సభ్యులు బోరున విలపించారు.