Extramarital Affair: మహిళ వివాహేతర సంబంధం.. భర్తకు తెలియకుండా ప్లాన్.. వదలని పోలీసులు..

: వివాహేతర సంబంధం ఓ మహిళ జీవితాన్ని ఆగం చేసింది. బంగారంతో పాటు డబ్బులు పోగొట్టుకోవటంతో పాటు చివరికి పోలీసుల చేతికిచిక్కి కటకటాలపాలైంది. దీంతో భర్తతో పాటు కుటుంబ సభ్యులు చీదరించుకునే స్థాయికి చేరుకుంది.

Extramarital Affair: మహిళ వివాహేతర సంబంధం.. భర్తకు తెలియకుండా ప్లాన్.. వదలని పోలీసులు..

Extramarital Affair

Updated On : June 26, 2022 / 7:53 PM IST

Extramarital Affair: వివాహేతర సంబంధం ఓ మహిళ జీవితాన్ని ఆగం చేసింది. బంగారంతో పాటు డబ్బులు పోగొట్టుకోవటంతో పాటు చివరికి పోలీసుల చేతికిచిక్కి కటకటాలపాలైంది. దీంతో భర్తతో పాటు కుటుంబ సభ్యులు చీదరించుకునే స్థాయికి చేరుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్టణం జిల్లా సుబ్బవరం శివారు గొల్లలపాలెంలో ఇటీవల ఓ యువకుడి హత్య జరిగింది. ఈ కేసుపై పోలీసులు విచారణ జరపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Viral Video: హమ్మయ్య బతికిపోయా.. మంచమెక్కి పైకొచ్చిన పులి.. వీడియో వైరల్

సబ్బవరం ప్రాంతానికి చెందిన సింహాచలం ఆరేళ్ల కిందట నగరంలోని ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ప్రాంతంలో ఓ కేబుల్‌ ఆపరేటర్‌ వద్ద పని చేసేవాడు. అక్కడే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొద్దిరోజులకు అక్కడి నుంచి సింహాచలం తన సొంత ప్రాంతానికి వెళ్లిపోయాడు. అయితే ఆమెతో ఉన్నచనువుతో తరచు వెళ్లి కలుస్తుండేవాడు. ఈక్రమంలో తనకు డబ్బులు అవసరం ఉందని బంగారంను తీసుకొచ్చి తాకట్టుపెట్టాడు. కొద్దిరోజుల తరువాత బంగారం అడిగితే.. కొంత డబ్బు ఇవ్వు బంగారం విడిపించుకొని వస్తానంటూ అలా పలు సార్లు మహిళ వద్ద డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులతో పేకాట ఆడేవాడు.

Viral Video: నగల దుకాణంలో దొంగల హల్‌చల్.. భయంతో వణికిపోయిన కస్టమర్లు.. వీడియో వైరల్

చివరికి మహిళ నిలదీయడంతో.. మనిద్దరి మధ్య అక్రమ సంబంధం నీ భర్తకు చెబుతానంటూ బెదిరించాడు. దీంతో సదరు మహిళ.. కొంతకాలంగా తనతో సన్నితంగా ఉంటున్న మరో వ్యక్తి గుడివాడ గోవింద్ కు జరిగిన విషయం చెప్పింది. ఇద్దరు సింహాచలంను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. ప్లాన్ లో భాగంగా.. సింహాచలంకు గోవిందు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పరిచయం అయ్యాడు. ఈనెల 19న రాత్రి 8గంటలకు మందుతాగేందుకు ఇద్దరు కలిసి గొల్లలపాలెం శివారుకు వెళ్లారు. ప్లాన్ ప్రకారం.. గోవిందు సింహాచలం గొంతుకోసి, రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశాడు. అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు విచారణ చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గోవిందుతో పాటు అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను పోలీసులు అరెస్టు చేసిరిమాండుకు తరలించారు.