World Aids Day 2025 : ఐటీ రంగాన్ని భయపెడుతున్న హెచ్ఐవీ.. పెరుగుతున్న కేసులు.. ఆ తరువాత రంగం ఏదో తెలుసా..? ఏపీ టాప్‌లో..

World Aids Day 2025 హెచ్ఐవీ కేసులు ఇటీవల కాలంలో అన్ని రంగాల్లో పెరుగుతున్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా దేశంలో ఐటీ రంగానికి చెందిన వారిలో

World Aids Day 2025 : ఐటీ రంగాన్ని భయపెడుతున్న హెచ్ఐవీ.. పెరుగుతున్న కేసులు.. ఆ తరువాత రంగం ఏదో తెలుసా..? ఏపీ టాప్‌లో..

World Aids Day

Updated On : December 1, 2025 / 8:37 AM IST

World Aids Day 2025 : HIV ఒక వైరస్. ఇది శరీరం రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే ఇది ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్) గా మారుతుంది. HIV, ఎయిడ్స్‌కు తేడాలు ఉన్నాయి.

HIV శరీరంలోని తెల్ల రక్త కణాలను (CD4 కణాలు) దాడిచేసే వైరస్. దీని వలన శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోతుంది. AIDS అనేది HIV సంక్రమణ యొక్క చివరి దశ. రోగనిరోధక శక్తి తీవ్రంగా తగ్గిపోయి కొన్ని రకాల అంటువ్యాధులు లేదా క్యాన్సర్‌లు వచ్చినప్పుడు ఎయిడ్స్ గా పరిగణించబడుతుంది. HIV ఉన్నంత మాత్రాన ఎయిడ్స్ ఉన్నట్లు కాదు.

హెచ్ఐవీ కేసులు ఇటీవల కాలంలో అన్ని రంగాల్లో పెరుగుతున్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా దేశంలో ఐటీ రంగానికి చెందిన వారిలో హెచ్ఐవీ కేసులు పెరిగిపోతున్నాయని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) హెచ్చరించింది. అన్ని రాష్ట్రాల్లో ఐటీ రంగానికి చెందినవారిలో హెచ్ఐవీ సంక్రమణ శాతం పెరుగుతోందని న్యాకో తాజాగా హెచ్చరించింది. అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలు అప్రమత్తంగా ఉండాలని.. ఈ రంగానికి సంబంధించిన హెచ్ఐవీ పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించింది. మత్తు ఇంజెక్షన్లు, రక్షణ లేని శృంగారం వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతోందని న్యాకో వర్గాలు చెప్పాయి.

ఐటీ రంగంతోపాటు వ్యవసాయ కూలీల్లో మాత్రం స్వల్పంగా పెరుగుతోందని న్యాకో వెల్లడించింది. ఇక తెలంగాణలో గత ఏడాదితో పోల్చితే ఈసారి హెచ్ఐవీ సంక్రమణ రేటు 0.44 నుంచి 0.41కు తగ్గిందని తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీశాక్) వెల్లడించింది. 2030 నాటికి ఎయిడ్స్ ను ప్రజారోగ్య ముప్పు జాబితా నుంచి తొలగించే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలు టెస్టులు పెంచాలని న్యాకో సూచించింది. అయితే, ఎయిడ్స్ కేసుల్లో మహారాష్ట్ర (3,62,392), ఏపీ (2,75,528) టాప్ లో ఉన్నాయి.