బ్రహ్మంగారిమఠం పీఎస్ దగ్గర వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి ఆందోళన

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పీఎస్ దగ్గర వైసీపీకి చెందిన మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి ఆందోళన దిగారు. నిన్న వైసీపీ ఏజెంట్ లక్ష్మిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. లక్ష్మిరెడ్డిని చూపించాలంటూ రఘురామిరెడ్డి పోలీసులను కోరారు. అతన్ని చూపించేందుకు పోలీసులు నిరాకరించడంతో వేలాది మంది కార్యకర్తలతో ఆయన ఆందోళన చేపట్టారు. చివరకు సీఐ, ఎస్సైలు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. ఈ విషయంపై తాము ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని రఘురామిరెడ్డి తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతారవణం నెలకొంది.