కొడాలి నాని, వంశీ ఇళ్ల దగ్గర ఉద్రిక్తత- జగన్ సంచలన ట్వీట్
పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Ys Jagan Sensational Tweet (Photo Credit : Google, Twitter)
Ys Jagan Mohan Reddy : వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఏపీలో జరుగుతున్న పరిణామాలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు కూలిపోయాయని జగన్ ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులతో ప్రజాస్వామ్యానికే పెను ముప్పు వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయని, యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయిందని వాపోయారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత చదవులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. గడచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడు రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారని జగన్ ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్యానికి, పౌర స్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోందని వాపోయారు. వెంటనే గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు జగన్. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెమ్మలకు వైసీపీ తోడుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు జగన్. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు.
Also Read : జగన్‌ను కలవాలంటే పడిగాపులే..! జక్కంపూడి రాజా వ్యాఖ్యలతో ఏకీభవిస్తా- కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు,…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2024