ప్రత్యేకహోదాను ప్రధాని మోడీ పట్టించుకోవాలి : పిల్లి సుభాష్‌చంద్రబోస్‌

ప్రత్యేకహోదాను ప్రధాని మోడీ పట్టించుకోవాలి : పిల్లి సుభాష్‌చంద్రబోస్‌

Updated On : February 11, 2021 / 2:15 PM IST

pilli Subhash Chandra Bose addressing special status for AP : ఏపీ రాష్ట్ర విభజన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని ప్రస్తుత ప్రధాని మోడీ పట్టించుకోకపోవడం శోచనీయమని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. ప్రధాని కానీ, ముఖ్యమంత్రి కానీ చట్టసభల్లో ఒక హామీ ఇస్తే అది చట్టంగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. లేకపోతే ప్రజాస్వామ్యంపైనే విశ్వాసం కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు.

రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామన్నారని బోస్‌ తెలిపారు. ప్రధాని, ముఖ్యమంత్రి హామీ ఇస్తే చట్టం చేసినట్లే పరిగణించాలన్నారు. ప్రధాని హామీకే విలువ లేకపోతే ప్రజాస్వామ్యంపై గౌరవం తగ్గిపోతుందన్నారు.

ప్రత్యేకహోదాను ప్రధాని మోడీ పట్టించుకోవాలని కోరారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేకహోదా గురించి కేంద్రంపై ఒత్తిడి చేయకుండా…ఇప్పుడు తమపై విమర్శలు చేస్తోందంటూ టీడీపీ వైఖరిని రాజ్యసభలో తప్పుపట్టారు.