Jyothula Nehru: టీడీపీ నేతకు గుండెపోటు.. పరామర్శించిన వైసీపీ ఎంపీ!
మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.

Nehru
Jyothula Nehru: మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. గుండెపోటుతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన నెహ్రూను పార్టీలకు అతీతంగా పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు వైసీపీ నాయకులు నేరుగా వెళ్లి, కొందరు ఫోనుల్లోనూ పరామర్శిస్తున్నారు. మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సత్తి సూర్యనారాయణ రెడ్డి సహా పలువురు వెళ్లి పరామర్శించారు.
ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణంరాజు కూడా వీడియో కాల్ చేసి నెహ్రూను పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వైసీపీ నేతలు జ్యోతుల నెహ్రూని పరామర్శించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలన్న పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి గెలచిన నెహ్రూ.. కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతగా ఉన్నారు.