Goods Train: గూడూరు రైల్వేస్టేషన్ లో ప్రమాదం
వేగంగా వెళ్తున్న గూడ్స్ రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన యువకుడు పట్టుతప్పి కిందపడిపోయాడు. అదే సమయంలో ప్రాణాలకు తెగించి రైల్వే ఉద్యోగి రూప్ కుమార్ యువకుడిని కాపాడాడు.

Goods Rail
Goods Train: వేగంగా వెళ్తున్న గూడ్స్ రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన యువకుడు పట్టుతప్పి కిందపడిపోయాడు. అదే సమయంలో ప్రాణాలకు తెగించి రైల్వే ఉద్యోగి రూప్ కుమార్ యువకుడిని కాపాడాడు.. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వేగంగా వెళ్తున్న గూడ్స్ రైల్లోకి ఓ యువకుడు ఎక్కే ప్రయత్నం చేశాడు.
అదుపుతప్పి కిందపడిపోయాడు. అతడిని కాపాడేందుకు రూప్ కుమార్ అనే రైల్వే ఉద్యోగి పరుగుపరుగున్న వెళ్లారు.. ప్రమాదవశాత్తు ఇద్దరు రైలుకు, ఫ్లాట్ ఫారమ్ కు మధ్యలో పడ్డారు. దీంతో స్టేషన్ లో ఉన్నవారు ఆందోళన చెందారు. గూడ్స్ రైలు వెళ్లిన వెంటనే పట్టాలవద్దకు పరుగులు తీశారు. అయితే ఇద్దరికీ స్వల్ప గాయాలే కావడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు.
ఈ దృశ్యాలు స్టేషన్ లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రాణానికి తెగించి యువకుడిని కాపాడ్డానికి రూప్ కుమార్ చేసిన ప్రయత్నాన్ని అందరూ అభినందించారు.