Youtuber Local Boi Nani : సజ్జనార్ సార్.. సారీ తప్పయింది.. ఇంకెప్పుడూ చేయను.. దండం పెట్టి తప్పొప్పుకొన్న లోకల్ బాయ్ నాని

ఇలాంటి పనుల ద్వారా ఎంతో మందిని బెట్టింగ్ భూతానికి బానిసలను చేయడం ఎంత వరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి అని సజ్జనార్ చెప్పారు.

Youtuber Local Boi Nani : సజ్జనార్ సార్.. సారీ తప్పయింది.. ఇంకెప్పుడూ చేయను.. దండం పెట్టి తప్పొప్పుకొన్న లోకల్ బాయ్ నాని

VC Sajjanar

Updated On : February 22, 2025 / 10:00 PM IST

Youtuber Local Boi Nani : సజ్జనార్ సార్ దెబ్బకు యూట్యూబర్, ఇన్ ఫ్లుయన్సర్, ఫిషర్ మెన్ లోకల్ బాయ్ నాని దిగొచ్చాడు. సజ్జనార్ సార్ కు సారీ చెప్పాడు. సారీ సర్.. తప్పయింది.. ఇంకెప్పుడూ చేయను.. అంటూ దండం పెట్టి మరీ తన తప్పు ఒప్పుకున్నాడు లోకల్ బాయ్ నాని. ఈ మేరకు అతడు ఒక వీడియోని విడుదల చేశాడు.

అసలేం జరిగిందంటే..
బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న ఇన్ ఫ్లూయన్సర్ లోకల్ బాయ్ నానిపై టీజీఎస్ఆర్ టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఇవేం దిక్కుమాలిన పనులు అంటూ లోకల్ బాయ్ నానిపై ఆయన విరుచుకుపడ్డారు. డబ్బు సంపాదించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇవేం దిక్కుమాలిన పనులు అంటూ లోకల్ బాయ్ నానిని ఉద్దేశించి సజ్జనార్ క్వశ్చన్ చేశారు.

మీ టాలెంట్ ను ఇతరత్రా రంగాల్లో ఉపయోగించుకుని సంపాదించుకోండి అని ఆయన హితవు పలికారు. ఇలాంటి పనుల ద్వారా ఎంతో మందిని బెట్టింగ్ భూతానికి బానిసలను చేయడం ఎంత వరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి అని సజ్జనార్ చెప్పారు. ఇప్పటికైనా సమాజ శ్రేయస్సు కోసం ఈ ప్రమోషన్లను ఆపండి అంటూ లోకల్ బాయ్ నానికి సూచించారు సజ్జనార్.

Also Read : లోకల్ బాయ్ నానికి సజ్జనార్ వార్నింగ్.. ఇవేం దిక్కుమాలిన పనులు?

సజ్జనార్ చేసిన కామెంట్స్ తో లోకల్ బాయ్ నాని పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో లోకల్ బాయ్ నాని దిగొచ్చాడు. తాను చేసింది తప్పే అని ఒప్పుకున్నాడు. సజ్జనార్ సార్ కి సారీ కూడా చెప్పాడు. అంతేకాదు మరోసారి ఇలాంటి దిక్కుమాలిన పనులు ఇంకెప్పుడూ చేయను అని మాట కూడా ఇచ్చాడు.

నాకు బుద్ధి చెప్పినట్లు వాళ్లకు కూడా బుద్ధి చెప్పండి సజ్జనార్ సర్- లోకల్ బాయ్ నాని..
”మూడు రోజుల క్రితం సజ్జనార్ సర్ నా బెట్టింగ్ వీడియో మీద స్పందించారు. నేను బెట్టింగ్ ఆడిన వీడియో పాతది. నేను బెట్టింగ్ ఎప్పుడో ఆపేశాను. వీడియో పాతదైనా కొత్తదైనా.. నేను చేసింది తప్పే. ఆ తప్పుని నిజాయితీగా ఒప్పుకుంటున్నా.

నేను చదువుకోలేదు. చాలా మంది చదువుకున్న ఇన్ ఫ్లుయన్సర్లే బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారు. వాళ్లను చూసి ఇదంతా నిజమే అనుకుని నేను కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశా. తర్వాత బెట్టింగ్ యాప్స్ ఫేక్ అని, వాటి వల్ల చాలామంది జీవితాలు నాశనమైపోతున్నాయి, వెంటనే వాటిని ఆపేయ్ అని కొందరు చెప్పడంతో… వెంటనే నేను వాటిని స్టాప్ చేశాను.

అప్పటి నుంచి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జోలికి వెళ్లడం లేదు. కానీ, పాత వీడియో అయినా సరే, కొత్త వీడియో అయినా సరే.. ఏదైనా చేసింది తప్పు కాబట్టి.. తప్పుని ఒప్పుకోవాలి. నేనైతే స్టాప్ చేశాను. కానీ, ఇంకా లక్షల మంది ఇన్ ఫ్లుయన్సర్లు అదీ చదువుకున్న వాళ్లు.. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. వాళ్లను చూసే నాలాంటి చదువుకోని వాళ్లు అది నిజమే అనుకుని చేస్తున్నారు.

Also Read : రైల్వేలో ఉద్యోగాలు.. ఇంటర్ పాసైతే చాలు TTE జాబ్‌కు అప్లయ్ చేయొచ్చు.. నెలకు రూ.80వేల వరకు జీతం..!

ఇక సోషల్ మీడియాలో కనిపించను..!
నాలో మార్పు వచ్చింది. దాన్ని అంతం చేస్తున్నా. ఇంకా చాలామంది ఇన్ ఫ్లుయన్సర్లలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నా. మనం జనాలకు పనికొచ్చే సందేశాలు మాత్రమే ఇవ్వాలి. ఇకపై బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లినా, ప్రమోషన్ చేసినా.. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటా. అసలు సోషల్ మీడియాలోనే కనిపించను అని ప్రామిస్ చేస్తున్నా.

మిగతా ఇన్ ఫ్లుయన్సర్లు కూడా ఇదే విధంగా తమ ఫాలోవర్లకు, సబ్ స్క్రైబర్లకు పనికొచ్చే వీడియోలు మాత్రమే చేయాలని, బెట్టింగ్ మాఫియాను అంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సజ్జనార్ సార్ మరోసారి సారీ. నాకు బుద్ధి చెప్పినట్లే మిగతా ఇన్ ఫ్లుయన్సర్లకు కూడా సజ్జనార్ సర్ బుద్ధి చెప్పాలి” అని లోకల్ బాయ్ నాని అన్నాడు.