పేదల రక్తాన్ని పీల్చే ఈ ‘పసుపు’పతి మళ్లీ వచ్చారు.. నమ్మొచ్చా?: సీఎం జగన్

YS Jagan: పసుపుపతిగా 2014లో మూడు పార్టీలతోనూ పొత్తు పెట్టుకుని ఎన్నో హామీలు ఇచ్చారని అన్నారు.

పేదల రక్తాన్ని పీల్చే ఈ ‘పసుపు’పతి మళ్లీ వచ్చారు.. నమ్మొచ్చా?: సీఎం జగన్

YS Jagan

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. ఎన్నికల వేళ మళ్లీ వచ్చేశారని, ఆ ముఠా నాయకుడితోనే వైసీపీ యుద్ధం చేస్తోందని జగన్ అన్నారు. అన్నమయ్య జిల్లాలో ఇవాళ మేమంతా సిద్ధం బస్సుయాత్ర నిర్వహించిన జగన్.. అనంతరం మదనపల్లె బహిరంగ సభలో మాట్లాడారు.

వదలను బొమ్మాలి అంటూ పసుపుపతి మళ్లీ పేదల రక్తాన్ని పీల్చేందుకు తయారవుతున్నారని, ఆయనను నమ్మొచ్చా? అని జగన్ అన్నారు. చంద్రబాబు మోసాలు చేయడాన్ని అలవాటుగా చేసుకున్నారని, అబద్ధాలే పునాదులుగా బతుకుతున్నారని చెప్పారు.

పసుపుపతిగా 2014లో మూడు పార్టీలతోనూ పొత్తు పెట్టుకుని ఎన్నో హామీలు ఇచ్చారని అన్నారు. వాటిని నెరవేర్చలేదని చెప్పారు. ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు మరోసారి పసుపుపతిగా మారారని చెప్పారు.

10 మార్కులే వేస్తారు
టీడీపీ కూటమికి జనం 10 మార్కులే వేస్తారని జగన్ అన్నారు. 99 మార్కులొచ్చిన తాను పరీక్షలకు భయపడతానా అని ప్రశ్నించారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వమే రావాలని, ఎందుకంటే.. తాను సీఎంగా ఉంటేనే పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పారు. చంద్రబాబు నాయుడి పేరు చెబితే ఒక పథకమైనా గుర్తుకురాదని అన్నారు. తన పేరు చెబితేనే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకు వస్తాయని తెలిపారు.

ఒక్క సీటు కూడా తగ్గేదేలే అని, డబుల్ సెంచరీ కొడదామని చెప్పారు. అధికారం కోసమే తోడేళ్లలా ముందుకు వస్తున్నారని అన్నారు. 30 పార్టీలు కలిసొచ్చినా భయపడేదేలే అని చెప్పారు. వాళ్ల తోకలు కట్ చేద్దామని చెప్పారు.

Also Read: చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారు, రాళ్లతో ఇప్పుడు ఎవరిని కొట్టాలి- బీఆర్ఎస్ నేతలు ఫైర్